28.7 C
Hyderabad
April 20, 2024 09: 26 AM
Slider కడప

పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ

#kadapapolice

కడప జిల్లాలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సి నేషన్ ప్రారంభమైంది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కోసం కడప నగరంలోని  పోలీసు సంక్షేమ వైద్యశాల, ఉమేష్ చంద్ర స్మారక కళ్యాణ మండపంలో వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. 

కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని పోలీసు సంక్షేమ వైద్యశాల లో  జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు.

పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.ఖాసిం సాహెబ్ స్థానిక పోలీసు సంక్షేమ వైద్యశాల లో టీకా వేయించుకున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ సిబ్బంది కో వ్యాక్సిన్ వేయించుకునేలా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది సమీప పీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఖాసిం సాహెబ్, ఏ.ఆర్ అదనపు ఎస్పీ రిషికేశవ రెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, పోలీసు సంక్షేమ వైద్యశాల వైద్యులు డా. సమీరా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

న్యూ ఏజెండా:దేశంలో జనాభా నియంత్రణే ఆరెస్సెస్ ఏజెండా

Satyam NEWS

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Murali Krishna

దోచుకుతింటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Satyam NEWS

Leave a Comment