40.2 C
Hyderabad
April 19, 2024 18: 36 PM
Slider ఆధ్యాత్మికం

మట్టపల్లిలో ఆలయ అర్చకులతో ఏకాంతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం

#mattapalli

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని పపమ పావన కృష్ణానది తీరాన మట్టపల్లి మహా పుణ్య క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి కోవెలలో గురువారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)పర్వడి రోజును భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు నిర్వహించారు.

కోవిడ్ -19 నియమ నిబంధనలు అమలులో ఉన్నందున ఆలయ అర్చకులు తెల్లవారుఝామున స్వామి అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలతో, వివిధ జాతుల సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష అర్చనలు చేశారు.భక్తులను అనుమతించకుండా ఆగమ శాస్త్ర విధిగా స్వామి,అమ్మవారికి సకల ఉపచారాలు విధిగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు,విజయకుమార్, కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్,ఆలయ అర్చకులు ఫణికుమారాచార్యులు,తూమాటి శ్రీనివాసాచార్యులు,పద్మనాభాచార్యులు, దేవస్థాన సిబ్బంది కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జమ్మూకశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి ఢోకా లేదు

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

Satyam NEWS

నా మతం కులంపై చెడు ప్రచారం చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment