36.2 C
Hyderabad
April 25, 2024 21: 36 PM
Slider సినిమా

వై ఎస్ జగన్ రాజకీయ వలలో చిక్కుకున్న వకీల్ సాబ్

#VakeelSaab

పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ కు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నింటిని ప్రయోగిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న డైనమిక్ ప్రైసింగ్ వ్యవస్థకు అనుగుణంగా టిక్కెట్ ధరలు పెంచుకుంటే అడ్డంకులు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను కూడా అడ్డుకున్నది.

ఆర్ధికంగా పవన్ కల్యాణ్ సినిమాకు అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన ఏపి ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాకు మాత్రం అనుమతివ్వలేదు.

ప్రీమియర్ షోలు కూడా వేసుకోకుండా వై ఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో కొత్త సినిమాల ప్రీమియర్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే, వకీల్ సాబ్ సినిమాపై ఏ విధమైన ఆదేశాలు ఇవ్వకుండానే బ్రేకులు వేసింది. గతంలో కొత్త సినిమాలకు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండేది.

వకీల్ సాబ్ సినిమాకు కూడా అటువంటి వెసులుబాటు ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు. కొంత మంది ఈ నెల 7వ తేదీన ప్రీమియర్ షో టికెట్లు విక్రయించారు కూడా.

అయితే, ప్రీమియర్ షోలను అధికారులు అడ్డుకున్నారు. గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ఇచ్చిన ప్రకటన వకీల్ సాబ్ పాలిట శాపంగా మారింది.

వకీల్ సాబ్ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపును అనుమతించేది లేదని ఆమె చెప్పారు.

ఒకవేళ అధిక ధరలకు టికెట్లు విక్రయించినా, ప్రీమియర్ షోలు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దానిపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

విజయవాడలోని ఓ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు నితిన్ సినిమా రంగ్ దేకు ధరల పెంపును అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం వకీల్ సాబ్ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు.

వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యనే అని పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.

అయితే, కరోనా కారణంగా బెనిపిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Related posts

సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం

Satyam NEWS

విరాట్ విశ్వరూపం: పాకిస్తాన్ కు దడ… భారత్ కు అండ

Satyam NEWS

గౌలిగూడాలో ఇమ్రాన్ ఖాన్ దిష్టి బొమ్మ దహనం

Satyam NEWS

Leave a Comment