24.7 C
Hyderabad
March 26, 2025 09: 47 AM
Slider ముఖ్యంశాలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు

#vallabhanenivamsi

వైసీపీ నాయకుడు, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది.

అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు.

దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఒక అపార్ట్మెంట్‌లో వంశీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు గురువారం తెల్లవారు జామున అక్కడకు పోలీసులు చేరుకున్నారు. పోలీసులను చూసి వెంటనే డ్రస్ మార్చుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు.

లోపల నుంచి బ్లూ మీడియాకు ఫోన్ చేసి పిలిపించారు. బ్లూ మీడియా చానల్స్ వచ్చిన తరువాత వంశీ బయటకు వచ్చారు. దీనితో పోలీసులు బిత్తరపోయారు. మరికొంతమంది వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా వంశీ ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువస్తున్నారు. వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.

Related posts

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

వైఎస్ జగన్ కు మరో షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

Leave a Comment