27.7 C
Hyderabad
April 20, 2024 00: 23 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ నియోజకవర్గ వాల్మీకి ఐక్యకార్యాచరణ కమిటీ కరపత్రం విడుదల

#valmiki

నవంబర్ 20న కొల్లాపూర్ వాల్మీకి ఐక్యకార్యాచరణ కమిటీ ఎన్నిక సమావేశం అలాగే కొల్లాపూర్ నియోజక వర్గ వాల్మీకి ఆలయ, కళ్యాణ మండపం అభివృద్ధి కమిటీ ఎన్నిక సమావేశం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వాల్మీకి సంఘం నాయకులు పేర్కోన్నారు. సోమవారం కొల్లాపూర్ పట్టణంలో కరపత్రాలను విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వాల్మీకి జాతి కోసం శ్రమించే వాల్మీకి ముఖ్య నాయకులు పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా తరలి రావాలని వాల్మీకి సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేటి తరంలో నిజాముల నిరంకుశ పాలనను తుది ముట్టించడంలో నమ్మిన వారి కోసం ప్రాణాలను పన్నంగా పెట్టిన వాల్మీకి జాతి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. రాజకీయ చదరంగంలో వాల్మీకులను పావులుగా చేశారని విమర్శించారు. కుల వృత్తి లేని వాల్మీకులు రాష్ట్రంలో దీన పరిస్థితిలో ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులకు రాజ్యాంగ పరంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాల్మీకి జాతి వెనకబడన వర్గంలో ఉండి కుల వృత్తి లేకపోవడంతో నిరక్షరాస్యతో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి పోయారన్నారు.

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్ని రంగాలలో వెనుకబడిపోయిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేస్తానని స్వయంగా నాటి ఉద్యమ సారథి నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు హామీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాల్మీకి జాతి ప్రాణ త్యాగాలతో పోలీసు లాంటిదెబ్బలకు అదరకుండా బెదరకుండా పట్టు వీడని పోరాటం చేయడం జరిగిందన్నారు. స్వరాష్ట్రం వచ్చింది కానీ వాల్మీకుల జాతి పెన్నం నుంచి పోయిలో పడినట్లు ఉందన్నారు. వాల్మీకి జాతి కంటే ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న కులవృత్తి ఉన్న కులాలకు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టి కులవృత్తి లేని పేదరికం నిరక్షరాస్యత నిండి ఉన్న వాల్మీకి జాతిని విస్మరించడంతో వాల్మీకి జాతిపై వివక్షత చూపుతున్నారని విమర్శించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వాల్మీకులను ఎస్టీ జాబితలో పునరుద్ధరణ చేయడం లేదన్నారు. బిజెపి పార్టీకి మూల స్తంభమైన రామాయణంను రచించిన శ్రీ వాల్మీకి మహర్షి వంశీయుల పట్ల కేంద్రం వివక్షత చూపుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ నాయుడు, కృష్ణమ్మ నాయుడు, రెడ్డి సత్యం, మీనిగ పరుశరాము నాయుడు, వెంకటేష్ నాయుడు, బోయలపల్లి కృష్ణయ్య, కురుమయ్య, కిరణ్, సత్యం, నరసింహ, పురుషోత్తం నాయుడు, జోడింగ్, రాఘవేంద్ర నాయుడు, మల్లయ్య, సుధాకర్ నాయుడు, నిరంజన్, సీపీ నాయుడు తదితరులు ఉన్నారు.

Related posts

క్విడ్ ప్రోకో: రైతుల కేసులపై రూ.5 కోట్లు ఖర్చు చేస్తారా?

Satyam NEWS

బీజేపీతో కలిసేవెళుతున్న సీఎం కేసీఆర్?

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తమవుతున్న గ్రామాలు

Satyam NEWS

Leave a Comment