28.7 C
Hyderabad
April 25, 2024 05: 52 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో శౌర్య దినోత్సవ వేడుకలు

#crpf

శౌర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరైన సిఆర్ పిఎఫ్ సౌత్ జోన్ స్పెషల్ డిజి రవి దీప్ సింగ్ సాహి క్వార్టర్స్ లో సీనియర్ అధికారులు మరియు దళ సిబ్బంది సమక్షంలో జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సైనిక సమ్మేళనం కూడా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 1965 ఏప్రిల్ 9 వ తేదీ  ప్రాముఖ్యతను డీజీ వివరించారు.

ఆ రోజు 3500 మంది పాక్ ఆర్మీ బలగాలు సర్దార్ పోస్ట్ పై ఆపరేషన్ (డెసర్ట్ హాక్) చేపట్టగా, గుజరాత్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన ఒక ప్లాటూన్ చాకచక్యంగా వ్యవహరించి వారిని ధైర్యంగా ఎదుర్కొంది. సీఆర్పీఎఫ్ ప్లటూన్ దాదాపు 12 గంటల పాటు యుద్ధరంగంలో ఉండి పాక్ సైన్యానికి దీటైన జవాబు ఇవ్వడంలో సాహసం  ప్రదర్శించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును “శౌర్య దినోత్సవం” (శౌర్య దినం) గా జరుపుకుంటున్నారు.

సీఆర్ పీఎఫ్ ప్లటూన్ సాహసోపేతమైన చర్యను పునరుద్ఘాటించిన ముఖ్య అతిథి ఈ విజయాన్ని తమకు అప్పగించిన విధుల నిర్వహణలో స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. 9న జీసీ హైదరాబాద్ క్యాంపస్ లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కు చెందిన 5 మంది సిబ్బందికి రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రదానం చేశారు.

ఇన్స్పెక్టర్/ఆర్.ఒ ఎం.రాజా, ఇన్స్పెక్టర్ /జిడి జి.సి.రాంచారి, ఇన్స్పెక్టర్ /జి.డి.సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్/ఆర్ ఒ ఎస్.అభిమన్యు, ఇన్స్పెక్టర్ /ఎం.టి.గంగాధరన్ నాయర్ లకు పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, భారత రాష్ట్రపతి సంతకంతో జారీ చేయబడిన విశిష్ట సేవ మరియు ప్రశంసా పత్రంతో పాటుగా, సర్వీసులో ఉన్న మరియు పదవీ విరమణ చేసిన సిబ్బంది శౌర్య పతక గ్రహీతలను కూడా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సదరన్ సెక్టార్ ఐజీ చారు సిన్హా, సౌత్ జోన్ ఐజి జి.వి.హెచ్.గిరిప్రసాద్, ఐ.జి.రాధా, ఐ.జి(మెడ్) డా.హెచ్.సి.లింగరాజు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ జీసీ సీఆర్ పీఎఫ్ డీఐజీ ఉదయభాస్కర్ బిల్లా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

Related posts

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS

ఎన్నికల నియమావళి ప్రకారం  అనుమతులు

Satyam NEWS

పెంట్లవేల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

Satyam NEWS

Leave a Comment