37.2 C
Hyderabad
April 19, 2024 12: 22 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి నమ్మ చెరువు కట్ట ఆక్రమణకు  గురి కాకుండా కాపాడాలి 

#encroachment

వనపర్తిలోని నమ్మ చెరువు కట్టను కాపాడాలని అఖిలపక్ష ఐక్యవేదిక  అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.అక్కడ విలేకరులకు పట్టాలు, లేదా పేద ప్రజలకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని, అలాగే 86 సర్వే నెంబర్ లో మిగిలి ఉన్న భూమి కూడా విలేకరులకు పట్టాల రూపంలో ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల కోరిక మేరకు రాజీవ్ గృహకల్ప ను పరిశీలించడానికి వెళ్ళామని, రాజీవ్ స్వగృహ పక్కనున్న నమ్మ చెరువు కట్ట అన్యాక్రాంతం అవుతుందని, దాని వెనుక పెద్దల హస్తం ఉందని చెప్పారు. కాపాడాక ఇప్పటివరకు బాగానే ఉందని, కానీ ఇరువైపులా రోడ్లు వేసి హడావుడి చేస్తున్న విషయాలు చూస్తే, వెనక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్లీ దీంట్లో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. 

సతీష్ యాదవ్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఎక్కడ అభివృద్ధి లేకుండా ఉన్నవార్డు ఒక్కసారిగా ఎస్టీ నిధులతో నమ్మ చెరువు కుంట చుట్టుపక్కల రోడ్లన్నీ నమ్మ చెరువు కుంట లింకు కలపడాన్ని చూస్తే అనుమానం కలుగుతుందని దీని వెనక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పట్లో చదును చేసిన భూమి క్యాన్సల్ చేసుకోకుండా ఈ మధ్య మళ్లీ స్టార్ట్ చేస్తారని తెలుస్తుందని, వారి కోసమే ఈ రోడ్లు హడావుడిగా ఎస్టీ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి  ఆ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నమ్మ చెరువు కుంటలో పత్రికా విలేకరులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. మంత్రి వెంటనే కల్పించుకుని 86 సర్వేనెంబర్ లో మిగిలిన భూమిని, నమ్మ చెరువు  కట్టలో ఉన్న భూమిని విలేకరులకు పట్టాలుగా ఇవ్వాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, సూర్యవంశం సతీష్, అవినాష్, బలపీరు   పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్

Related posts

సాంకేతికత ఆలంబనగా సాగుతున్న ఆంధ్ర సాంస్కృతిక ప్రభ

Satyam NEWS

దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదు…

Satyam NEWS

శాండ్ స్కాండల్: ప్రభుత్వం మారినా ఇసుక మాఫియా అలానే

Satyam NEWS

Leave a Comment