10వ బెటాలియన్ శిక్షణా కేంద్రం, బీచుపల్లిలో (జోగులాంబ గద్వాల్ జిల్లా) 2024 బ్యాచ్‌కు చెందిన ఎస్సిటి పిసిఎస్ (టీజీఎస్పీ) లకు 10వ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ బీచ్‌పల్లి, జోగులాంబ గద్వాల్‌లో యోగాలో 9 నెలల పాటు వనపర్తి జిల్లా యోగా మాస్టర్ దండు సుగుణ శిక్షణ ఇచారు. ట్రైనీలు ప్రతి ఒక్క కదలికను నేర్చుకున్నారు. ట్రైనీలు, అధికారులతో ఆమె సమయపాలన, విధేయత మంచిదని చెప్పారు. యోగా టెక్నిక్‌లో ఆమెకున్న పరిజ్ఞానం అమోఘమని ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ సత్యనారాయణ, కమాండెంట్ ఎన్.వి.సాంబయ్య చెప్పారు. ఈ సందర్బంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఔట్ స్టాండింగ్, ప్రశంసా పత్రాన్ని, దీక్షంత్ పరెడ్ (టీజీఎస్పీ) 2024 బ్యాచ్ మెమెంటో ను అందజేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్