తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వంగల దాలి నాయుడు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం విశాఖపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా జరిగిన జై బాపు… జై భీమ్… జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వంగల దాలి నాయుడుకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం అల్లూరి, పార్వతీపురం మన్యం డిసిసి శతక బుల్లిబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు, ఏపీసిసి జనరల్ సెక్రటరీ, ఆదివాసి స్టేట్ అబ్జర్వర్ పాచిపెంట శాంతి కుమారి, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, కురుపాం ఇంచార్జ్ అడ్డాకుల చిన్నారావు సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలని, పాలకుల, అధికారుల దురాగతాలను ఎండగట్టాలని, బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం నుండి వంగల దాలి నాయుడు పార్టీలోకి రావడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post
next post