28.7 C
Hyderabad
April 20, 2024 10: 49 AM
Slider విజయనగరం

ప్రజా గాయకుడు వంగపండు ఇక లేడు

#VangapanduPrasadarao

ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు(77‌) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు ప్రసాదరావు పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. వందలాది జానపద పాటలను రచించిన వంగపండు ప్రసాదరావు ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందాడు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన ప్రజా గాయకుడు ఆయన. పల్లెల్లో ఉండే సాధారణ జనంతో బాటు గిరిజనులనూ చైతన్యపరిచిన గాయకుడుగా వంగపండుకు పేరుంది. 1943లో పెదబొండపల్లిలో ఆయన జన్మించాడు. అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం ఆరంభం అయింది.

2017లో కళారత్న పురస్కారం అందుకున్నాడు. 1972లో ఆయన జననాట్యమండలిని స్థాపించాడు. మూడు దశాబ్ధాలలో 300 పాటల వరకూ ఆయన రచించినట్లు చెబుతారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ఆయన ప్రఖ్యాతి చెందాడు.

Related posts

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

సైట్ ఇష్యూ: ఏపి ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్

Satyam NEWS

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment