రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ కడప జిల్లా రాజంపేటలో మైనారిటీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11 వ రోజుకు చేరాయి. ఆర్ .అండ్.బి బంగాళా వద్ద జరుగు తున్న ఈ దీక్షా శిబిరాన్ని జిల్లా నూరుబాష సంఘం నేతలు సందర్శించారు. పోరాటానికి వారు సంఘీభావం ప్రకటించారు.
సి.ఏ.ఏ,యనార్సీ ల మూలంగా మైనారిటీ లతో పాటు, ఎప్పటి నుంచో ఇతర ప్రాంతాల స్థిర పడిన వారు జైలు కు వెళ్లక తప్పదని వారు అన్నారు. ఆందోళనలో వైవిధ్యం గా శిబిరం వద్ద జైలు సెట్టింగ్ లో డేమో చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం కు మైనారిటీ నేత గుల్జార్ ఆధ్వర్యం వహించారు.