నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల నోటికి రాళ్లు అందిస్తున్నాడని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుకు కడప జిల్లా చిట్వేల్ లో వెరైటీ నిరసన ఎదురైంది. టిడిపి నేత నరసింహ ప్రసాద్ ఈ వెరైటీ నిరసనకు శ్రీకారం చుట్టారు. ఆయన రంగు రాళ్లు అమ్మేవారి వేషం వేసుకుని వచ్చి చిట్వేల్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట తన నిరసన తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశాడంటూ రంగు రాళ్ళు అమ్ముతున్నట్లు వినూత్న వేషధారణతో ఆయన నిరసన తెలియ చేశారు. గత కొద్ది రోజులుగా పేద ప్రజల నోటి దగ్గర కూడు తీసేశాడని ఆయన ఆరోపించారు. ఎంతో మంది పేదలు తెల్ల రేషన్ కార్డులు తొలగించారని ఆయన అన్నారు. అదే విధంగా పేద ప్రజలకు ఆసరాగా ఉన్న పెన్షన్లు కూడా తీసేశారని టిడిపి నేత నరసింహ ప్రసాద్ విమర్శించారు.