గద్దల కొండ గణేష్ తో బంపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తన పదో చిత్రాన్ని మొదలుపెట్టేస్తున్నాడు. ఈ సారి బాక్సర్ గా నటించబోతున్న వరుణ్ తేజ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ తెలిపింది. అల్లూ అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజాది కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయి. హీరోయిన్ తదితర ముఖ్య భూమికలు ఎవరు పోషిస్తారనేది వేచి చూస్తే కానీ తెలియదు.
previous post
next post