వసంత పంచమి ఉత్సవాలు శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ లో ఘనంగా జరిగాయి. వసంత పంచమి పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని శుకబ్రహశ్రమం స్వామి సర్వాత్మనంద మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.
సరస్వతి శిశుమందిర్ పాఠశాల లో జరిగినవ ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ముందుగా స్వామి సర్వాత్మనంద సరస్వతి దేవి పటం ఎదుట హోమం నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం బాసర నుండి తెప్పించిన కుంకుమ, అక్షింతలు పిల్లలకు పంపీణీ చేశారు.