23.8 C
Hyderabad
September 21, 2021 22: 26 PM
Slider ఆధ్యాత్మికం

ప్రాచ్య విద్యలను నేర్చుకొని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంది

#bachimanchi

వేదములను శ్రుతులు అంటారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వేదాలను శ్రుతులు అని అంటారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము,దైనందిన ఆచారాలు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి.’ ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా ‘కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రం లోని పవిత్ర ఉత్తర వాహిని కృష్ణా నది తీరాన నిత్యం పండితుల,వేద విద్యార్థుల వేద ఘోషతో పరిఢవిల్లుతున్న శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలను ‘ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ, ‘నిత్య సంధ్యావందన అభ్యాసన శిక్షణా సమితి, వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి, సభ్యులు ఆదివారం వేద పాఠశాలను సందర్శించారు.

వేద పాఠశాల,వేదాధ్యాయన తరగతుల నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ 2013వ, సంవత్సరంలో పంచ లక్ష గాయత్రీ జప యజ్ఞంతో ప్రారంభమై నేడు శతకోటి గాయత్రీ మహా మంత్ర జప యజ్ఞానికి శ్రీకారం చుట్టామని అన్నారు.రోజుకు కనీసం ఒక్కసారి సంధ్యావందనం చేయాలని, సంధ్యావందనం పిదప గాయత్రి జపం, అందులో దశాంశం క్షీర తర్పణం చేయాలని, కనీసం రోజుకు సహస్ర గాయత్రీ జపం చేయాలని,సంధ్యావందనం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పటానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీరామచంద్రమూర్తి అన్నారు.తమ సంస్థ ద్వారా భారతీయుల యందు వేద విద్యను సంప్రదాయాలను పెంపొందించటం, అర్హత కలిగిన పేద విద్యార్థులకు విద్యాభ్యాసం కొరకు ఆర్థిక సహాయం అందించడం, పేదలకు వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం చేకూర్చటం,ప్రపంచ శాంతికై సామూహిక గాయత్రీ జప యజ్ఞాలు నిర్వహించడం, జరుగుతుందని అన్నారు.

మా చిన్ననాటి రోజుల్లో సరియైన వసతులు లేక అనేక ఇబ్బందులకు ఓర్చి వేద విద్య అభ్యసించామని,నేడు వేదానికి ప్రాధాన్యత సంతరించుకుందని,మన ప్రాచ్య విద్యలను నేర్చుకొని కాపాడవలసిన బాధ్యత విద్యార్ధులైన మీపై ఉందని, వేదాధ్యయనం చేసే వారికి తమ తోడ్పాటు తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.

చతుర్వేదాలు అంతరించి పోకుండా తమ తమ పిల్లులకు వేద విద్యను అభ్యసించటానికి ప్రోత్సాహం చూపిస్తున్న తల్లిదండ్రులకు శత సహస్ర నమస్సులు తెలియచేస్తున్నానని అన్నారు.భవిష్యత్తులో విద్యార్థులు వేదమాత గాయత్రి దేవి అనుగ్రహంతో మహిమాన్విత పండితులుగా ఎదగాలని విద్యార్ధులను ఆశీర్వదించి అధ్యాపకులకు శుభాశీస్సులు అందజేశారు.

అనంతరం కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ తరఫున శ్రీరామచంద్రమూర్తి నిత్యావసర వస్తువులతో పాటుగా 25,011 రూపాయల చెక్కును వితరణగా అందించారు.అనంతరం శ్రీరామచంద్రమూర్తి,సభ్యులను వేద పాఠశాల పాలక సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణిశర్మ ఘనాపాటి,కార్యదర్శి సూరి లక్ష్మీనారాయణ శర్మ,బాచిమంచి చంద్రశేఖర్ శర్మ,రంగరాజు వాసుదేవరావు, పులిజాల శంకర్రావు, ఖండవల్లి సీతారాం, జి.వి.ఎన్.హనుమంతరావు, కులకర్ణి చంద్రశేఖర్,బొబ్బిళ్ళపాటి శేషగిరిరావు,తేజోమూర్తుల రవిశర్మ వేద పండితులు,వేద విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చెంచు గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

సవాల్: ట్రిబ్యునల్ కు వెళ్లిన ఐపిఎస్ అధికారి ఏ బి

Satyam NEWS

కెఆర్ఎంబీ సమావేశానికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!