34.2 C
Hyderabad
April 19, 2024 22: 47 PM
Slider మహబూబ్ నగర్

నీ చావు నువ్వు చావు నేను మాత్రం సేఫ్

#Veepanagandla MRO

కరోనా సంగతి ఏమో కానీ  తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది మాత్రం పకడ్బందిగా రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రక్షణ వలయం ఎంతలా ఉందంటే ఎవరైనా వారికి ద్వారం నుంచి ప్రవేశం లేదు. పని ఏదైనా సరే కిటికీలో నుంచి మాట్లాడాల్సిందే. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని విపన గండ్ల ఎమ్మార్వో కార్యాలయం చూస్తే హమ్మా కరోనా ఇంత పని చేయిస్తున్నదా అనిపించక మానదు.

కార్యాలయంలోకి ఎవరూ ఎంటర్ కాకుండా చుట్టూ తాళ్లు కట్టేశారు. అది ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నమాట. ఇక గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికీ సరైన మాస్క్ లు పెట్టుకోవడం లేదు కాబట్టి వారు ఎవరైనా సరే కిటికీ లో నుంచి మాట్లాడాల్సిందే అలా ఏర్పాటు చేశారు.

కార్యాలయంలోకి ఎవ్వరు రాకుండా ఇలా దూరం నుంచి మాట్లాడి  పంపిస్తున్నారు. ఓకే… తహసిల్దార్ ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంతోషమే. మరి వచ్చిన జనాల సంగతి ఏమిటి? వారు కిటికీ దగ్గర భౌతిక దూరం పాటించకుండా నిలబడాల్సి వస్తున్నది. అంతే కాదు ఎవరూ మాస్కు పెట్టుకోవడం కూడా లేదు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద శానిటైజర్ ఉండాలి అదీ లేదు. మరి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా? జనం జాగ్రత్త ఎవరు చూస్తారు? పనుల మీద వచ్చేవారు హడావుడిలో ఇవన్నీ మర్చిపోవచ్చు. తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది చెప్పాలి కదా? అదే విషయాన్ని ప్రజలు అడుగుతున్నారు. కరోనా అంటే తెలియన గ్రామీణ ప్రజలను రక్షించేవారు లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్వో ఒక్కడే సేఫ్ గా ఉంటే ప్రజలను పట్టించుకోవాల్సింది ఎవరు?

Related posts

గోగర్భం వద్ద క్షేత్రపాలకుడికి ఘనంగా అభిషేకం

Satyam NEWS

కొండపై ఫైర్: శ్రీవారి పోటులో స్వల్ప అగ్నిప్రమాదం

Satyam NEWS

దేశానికి దిశానిర్దేశం చేసిన పండిట్ దీన్ దయాళ్

Satyam NEWS

Leave a Comment