32.7 C
Hyderabad
March 29, 2024 11: 07 AM
Slider నల్గొండ

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ ఎర్ర జెండా అండతో నాడు వీరోచిత పోరాటం చేసిందని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజల కార్మికుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు కార్యాలయం వద్ద కార్మికులతో రోషపతి మాట్లాడుతూ నాడు మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని, నిజాం పాలనలో మహిళలని కనీసం మనిషిగా చూసే పరిస్థితి, మహిళల మానప్రాణాలకు రక్షణ లేక చిన్న చూపు చూసేవారని అన్నారు. ఈనాడు మహిళలు పనిచేసే స్కీం వర్కర్స్, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నెలకు వెయ్యి రూపాయలు, ఆశ, పరిశ్రమలలో, అంగన్వాడి, తదితర సంస్థల్లో పనిచేసే వారికి అతి తక్కువ వేతనంతో వెట్టి చాకిరి నేటికి చేయిస్తున్నారని ఆరోపించారు.

కరోనా తరుణంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసం నెలకు పదివేల రూపాయలు చొప్పున ఆరు నెలలు ఉచితంగా ఇవ్వాలని, మున్సిపాలిటీ పట్టణాల్లో ,గ్రామాల్లో కనీసం 200 రోజులు ఉపాధిహామీ పని కల్పించి రోజుకు 600 రూపాయల చొప్పున ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలక సోమయ్య గౌడ్, సాముల కోటమ్మ, చింతకాయల పర్వతాలు, మొదాల గోపమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవమ్మ, అంజమ్మ, మాధవి, వెంకటమ్మ పాల్గొన్నారు‌.

Related posts

కరోనా వైరస్ నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తాం

Satyam NEWS

అయోధ్య రామ మందిర నిర్మాణానికి బండి సంజయ్ విరాళం

Satyam NEWS

ఉపాధ్యాయ సమస్యలపై 29న జరిగే ధర్నా విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment