28.2 C
Hyderabad
April 20, 2024 13: 29 PM
Slider సినిమా

వీసీసీ ఛాంపియనషిప్ అర్హత సాధించిన వెలాసిటీ గేమింగ్

#velocity gamming

వెలాసిటీ గేమింగ్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన వలోరెంట్‌ కాంకరర్స్‌ ఛాంపియన్‌షిప్‌ (వీసీసీ) కోసం అర్హత సాధించింది. ఇలా వీసీసీలో అర్హత సాధించిన మొట్టమొదటి దక్షిణాసియా టీమ్‌ ఇది. మహీ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కశ్యప్‌ ప్రారంభించిన ఈ వెలాసిటీ గేమింగ్ ఈ గేమింగ్ పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకువెళుతున్నది. వీసీసీ ఛాంపియన్ షిప్ వచ్చే నెలాఖరులో జరుగుతుంది. వలోరెంట్‌ కాంకరర్స్‌ చాంఫియన్‌షిప్‌ను యుఎస్‌ కేంద్రంగా కలిగిన ప్లేయర్‌ ఫోకస్డ్‌ గేమ్‌ డెవలపర్‌ మరియు పబ్లిషర్‌ రియోట్‌ గేమ్స్‌ నిర్వహిస్తుంది.

ఈ చాంఫియన్‌ షిప్‌ విజేత వీసీసీ చాంఫియన్‌షిప్‌ టైటిల్‌తో పాటుగా  33వేల డాలర్ల బహుమతి మొత్తంలో అత్యధిక వాటానూ పొందగలరు. రియోట్స్‌ వాలోరెంట్‌ గేమ్‌ను జూన్‌ 2020లో విడుదల చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 44 మిలియన్ల మంది యూజర్లు అంతర్జాతీయంగా ఉన్నారు.

న్యూ జూ యొక్క గ్లోబల్‌ ఈస్పోర్ట్స్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌ నివేదిక ప్రకారం,  ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ 2021లో 1.084 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. గత సంవత్సరం ఇది  947.1 మిలియన్‌ డాలర్లు. వీడియో గేమ్స్‌ వినియోగించుకుని నిర్వహించే ఓ విధమైన పోటీ ఈ–స్పోర్ట్స్‌. ఇందులో ప్రవేశం ఉన్న కశ్యప్ ఆధ్వర్యంలోని వెలాసిటీ గేమింగ్‌ బృందం 2020లో జరిగిన 15 టోర్నమెంట్లలో 13 ఆడటమే కాదు, అన్నిటిలోనూ  విజయం  సాధించింది.

థాయ్‌ల్యాండ్‌,మయన్మార్‌, సింగపూర్‌ వంటి దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ బృందాలను సైతం అధిగమించి  అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో వెలాసిటీ గేమింగ్‌ ఇప్పుడు మూడవర్యాంక్‌ సాధిస్తే,  ఇండియాలో నెంబర్‌ 1 ర్యాంక్‌ను పొందింది. ఈ–స్పోర్ట్స్‌ ఇప్పుడు  వీడియో గేమ్‌ పరిశ్రమలో అతి ముఖ్యమైన విభాగంగా మారాయి.

2010 వ సంవత్సరం నుంచి ఎంతో మంది గేమ్‌ డెవలపర్లు చురుగ్గా గేమ్స్‌ డిజైన్‌ చేయడంతో పాటుగా టోర్నమెంట్లు, ఇతర కార్యక్రమాల కోసం ఫండింగ్‌ను సైతం అందిస్తున్నారు. ఈ–స్పోర్ట్స్‌ వీక్షకులలో అధికశాతం 18–34 సంవత్సరాల నడుమ వ్యక్తులు ఉండటం చేత ఈ–స్పోర్ట్స్‌కు దక్షిణాసియా, ఆగ్నేయాసియా  మరీ ముఖ్యంగా భారతదేశంలో అధిక ప్రజాదరణ లభిస్తుంది. ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ విస్తృత శ్రేణిలో కెరీర్‌ అవకాశాలను  సైతం అందిస్తుంది.

కేవలం గేమర్లకు మాత్రమే కాదు,  కాస్టర్లు, గేమ్‌ పరిశీలకులు, ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు, కెమెరామెన్‌లు, ఎనలిస్ట్‌లు మొదలైన అంశాలలో  తమ ప్రయత్నాలను తీవ్రంగా చేసే ఔత్సాహిక యువతకు సైతం ఇక్కడ అవకాశాలు లభిస్తాయి. ‘‘ఈ–స్పోర్ట్స్‌ కూడా ఓ విధమైన క్రీడ. దీనిలో  గేమర్లు బృందాలుగా ఏర్పడటంతో పాటుగా ఆటలాడతారు.

దానికిగానూ వారు డబ్బునూ పొందుతారు. ఈ–స్పోర్ట్స్‌ను కెరీర్‌గా తీసుకోవాలన్నది నా కోరిక. అయితే ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు. నా దగ్గర తగినన్ని డబ్బులు వస్తే సొంతంగా  ఓ గేమింగ్‌ కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాను. నా కల వాస్తవ రూపు దాల్చిందిప్పుడు. 2019లో వెలాసిటీ గేమింగ్‌ను ఆరంభించాను. ఈ–స్పోర్ట్స్‌ విభాగంలో ఇండియా ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ, ఇప్పుడు మొత్తం మార్కెట్‌ వృద్ధికి చోదకంగా నిలుస్తుంది.

దీనికి ఇక్కడ ఉన్న యువతే కారణం. దీనితో పాటుగా అందుబాటు ధరలలో గేమింగ్‌ పీసీలు కూడా దోహదం చేస్తున్నాయి. ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ భారతదేశంలో  రాబోయే కొద్ది సంవత్సరాలలో మరింత మంది యువతను ఆకట్టుకోనుంది. ఒక్కసారి ఇంటర్నెట్‌ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రావడంతో పాటుగా స్థిరంగా మారడం, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రచార స్ఫూర్తితో చిప్స్‌ తయారీని భారతదేశంలో అధికంగా చేయడం వంటి అంశాలు ఈ–స్పోర్ట్స్‌ విస్తరణకు దోహదపడతాయి’’ అని కశ్యప్‌ వెల్లడించారు.

న్యూ జూ  గ్లోబల్‌  ఈ–స్పోర్ట్స్‌ అండ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్‌ నివేదిక ప్రకారం, ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ 2021లో 1.084 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. గత సంవత్సరం ఇది 947.1 మిలియన్‌ డాలర్ల ఆదాయం సృష్టించింది. దీనితో పాటుగా ఈ–స్పోర్ట్స్‌ పరిశ్రమ మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా 833.6 మిలియన్‌ డాలర్లను పొందగలదని ఇది అంచనా వేసింది.  ఈ–స్పోర్ట్స్‌కు లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రేక్షకులు పెరుగుతుండటమే దీనికి కారణంగా అభివర్ణించింది. ఈ నివేదిక అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆడియన్స్‌ 2021 సంవత్సరాంతానికి 728.8 మిలియన్లకు చేరనున్నారు. 2020లో ఈ సంఖ్య  662.6 మిలియన్లుగా ఉంది.

ప్రస్తుతం, వెలాసిటీ గేమింగ్‌  మొత్తం  కార్యకలాపాలకు మనోజ్‌ కశ్యప్‌ ఒక్కరే నిధులను సమీకరిస్తున్నారు.  అయితే, ఈ కంపెనీ ఇప్పుడు తమ పోర్ట్‌ఫోలియో(మరిన్ని జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లను గెలుచుకున్న తరువాత)ను శక్తివంతంగా మార్చుకున్న తరువాత బాహ్య పెట్టుబడిదారుల నుంచి కూడా నిధులను సమీకరించాలని చూస్తుంది.

For more information, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

మోటారు మెకానిక్ లకు వివిసి మోటార్స్ బియ్యం పంపిణీ

Satyam NEWS

వరదకు కొట్టుకుపోయిన సోదరుల్లో ఒకరి మృతదేహం లభ్యం

Satyam NEWS

29 నుండి జులై 7 వరకు తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment