27.7 C
Hyderabad
March 29, 2024 02: 07 AM
Slider కరీంనగర్

బాడ్ కరోనా :ప్రముఖ విద్య వేత్త కుమారా స్వామి మృతి

vemulawada kumar sir dead with corona

పట్టణం లో గత 37 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి తోడ్పడి పలువురు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చి దిద్దిన వెంకటరమణ పాఠశాల వ్యవస్థాపకులు కుమార్ సార్ అని ప్రేమగా ఇక్కడి వారు పిలిచే చిలుముల కుమార్ స్వామి కరోనా బారిన పడి గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్సహ పొందుతూ సోమవారం మృతి చెందారు.ఆక్సీజెన్ అందక పోవడం,ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తో ప్లాస్మా అందించినప్పటికీ వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ చికిత్స పొందుతున్న కుమార్ సార్ మృతి తో వేములవాడ లో విషాదం నెలకుంది. .బోయిన్ పల్లి మండలం స్థంభం పల్లి లో జన్మించిన కుమార్ స్వామి 1980 లో వేములవాడ కు చేరుకొని పేద ప్రజలకు అనుకూలం గా దళిత, స్లం వాడల్లో తన కుమారుని పేరుతో వెంకట రమణ పేరు తో పాఠశాలను ప్రారంభించి ఫీజు ఇచ్చిన ఇవ్వకున్నా పేద వారికి ముఖ్యం గా జాత్రగ్రౌండ్ వారికి తమ సేవలు అందించారు. 2017 వరకు 37 సంవత్సరాలు గా పేద ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పించారు. వివిధ కారణాలతో మూడేళ్ళ క్రితం పాఠ శాలను మూసివేసిన అయన, పలు ఎన్నికలల్లో పోటీ చేశారు.పలువురికి ఉచితం గా విద్య అందించినట్లు ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది.అయన మృతి పట్ల అయన విద్యార్థులు,నాయకులు,ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సంఘాలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ఘనంగా రెండవ రోజు మేడే వారోత్సవాలు

Satyam NEWS

అడిటర్ బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం

Bhavani

స్పందన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కారం

Bhavani

Leave a Comment