నిన్నటి వరకు ఎలా వచ్చారో ఎంత వేగం గా వచ్చారో మరిచి పొంది.ఇక పై వేములవాడ కు వచ్చే పోయే రహదారులపై స్పీడ్వే గా వెళ్తామంటే కుదరదు ఎందుకంటే ఆయా రోడ్ లపై పోలీస్ లు స్పీడ్ గన్ లు ఏర్పాటు చేశారు.స్పీడ్ లిమిట్ దాటిందో గన్ ఫోటో తీస్తే అంతే ఇంటికి చాలానే రావడం కాయం.మీరు ఫైన్ కట్టడం తప్పదు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో స్పీడ్ గన్ సేవలు ప్రారంభించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ Ch. శ్రీధర్ తెలిపారు.
అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి వాహన దారులు వేగ పరిమితికి మించి వాహనాన్ని నడిపితే స్పీడ్ గన్ ద్వారా జరిమానా పడుతుంది అని వాహనం ఎంత వేగంగా వెళ్తున్న స్పీడ్ గన్ ద్వారా వాహనం ఫోటో తీసి Rs.1000/- చలనా విధించటం జరుగుతుంది. కాబట్టి వాహనదారులు అధిక వేగం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మొదటగా ఈ స్పీడ్ గన్ ని హైవే మీద ఉపయోగిస్తున్నట్టు SI శివకేశవులు తెలిపారు.