27.7 C
Hyderabad
April 20, 2024 00: 33 AM
Slider కరీంనగర్ తెలంగాణ

రాజన్న గుడిలో రాజుకున్న వివాదం:లడ్డుల సొమ్ము మింగింది ఎవరు?

#vemulawada sree rajarajeswara swami temple laddu scam

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో ల‌డ్డూ విక్ర‌యాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై ఆల‌య అధికారులు క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల పేరుతో చేతులు దులుపు కోచూస్తుండగా ఇంత పెద్ద స్కామ్ ఒకరి తో కాదని ఇండులో ఆలయం లోని పెద్ద తలకాయల జోక్యం ఉందని,వారిని ఎందుకు తప్పిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ లడ్డు స్కామ్ పై వేములవాడ లో జోరుగా చర్చ జరుగుతుండగా రాజన్న గుళ్లో నిప్పు రాజుకుంది.ఆలయ ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయి ప్రస్తుతం కొందరు అవినీతి అధికారులు జట్టు గా తయారయ్యి ముఖ్యమైన విభాగాల్లో చేరి వారి ఆధిపత్యం కొనసాగీస్తూ కింది స్థాయి ఉద్యోగుల తో పలు అవినీతి పనులు చేయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని ,దొరికితే కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తూ తాము మాత్రం దర్జాగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.గత సంవత్సర కాలం గా దేవాలయం పైన వారు నంది అంటే నంది పంది అంటే పంది అన్న రీతిగా తమ అధికారం కొనసాగిస్తున్నరని విమర్శలు వెలువడుతున్నాయి.


అసలేం జరిగింది..?


ఆలయ ప్రసాదాల విక్రయం కౌంటర్ లో ల‌డ్డూ అమ్మ‌కాల్లో వెంక‌టేశ్ దొంగ లెక్క‌లు చూపి 2 ల‌క్ష‌ల ల‌డ్డూల‌కు సంబంధించి రూ. 40 ల‌క్ష‌లు కాజేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వచ్చాయి. డ‌బ్బును వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు వాడుకున్న‌ట్లుగా ,కౌంట‌ర్‌లో ల‌డ్డూల స్టాక్ లేన‌ప్ప‌టికీ 2 ల‌క్ష‌ల ల‌డ్డూలు ఉన్న‌ట్లుగా స‌ద‌రు ఉద్యోగి పేర్కొంటూ త‌ప్పుడూ లెక్క‌లు సృష్టించాడని , ప్ర‌సాదం త‌యారీ విభాగం క్రాస్ చెక్ చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చిందని చెబుతుండగా స్కామ్ ను గమనించిన కొందరు ఉద్యోగులే ఉప్పందించి విషయాన్ని బయటకు తెచ్చినట్లు ఆలయ వర్గాలు గుసుసలాడుతున్నాయి.ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటకు పొక్కడం, పత్రికల్లో రావడం తో కంగుతిన్న సదరు అధికారులు ఆ ఉద్యోగి చేత ఈ నెల 14 నుండి 18 వరకు భక్తుల రద్దీ లేకున్నా అమ్మకాలు జరిగినట్లు రోజుకు పదిలక్షల వంతున ఆలయ ఖజానా కు కట్టించి సదరు రికార్డు అసిస్టెంట్‌ ,ల‌డ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్జీ వెంక‌టేశ్‌ను ఆల‌య కార్యాల‌యానికి అటాచ్ చేశారు. ఇత‌ని స్థానంలో జూనియ‌ర్ అసిస్టెంట్ సురేశ్‌ను అధికారులు నియ‌మించారు. విచార‌ణ క‌మిటీ నివేదిక అనంత‌రం వెంక‌టేశ్‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని వెల్ల‌డిస్తూ ప్రస్తుతానికి ఈ గొడవ సద్దు మణిగెలా చూసారు.
కానీ వారు చేసిన పని ఆలయం లో బయట మరింత వివాదం రేపుతోంది. హుండీ కౌంటింగ్ లో వెయ్యి రూపాయలు దొంగిలిస్తేనే సదరు వ్యక్తులని సస్పెండ్ చేసే అధికారులు నలభై లక్షలు ప్రాడ్ జరిగినా ఎందుకు బదిలీ తో సరి పెడుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.సదరు ఉద్యోగి పెద్ద తలకాయలకు సంబందించిన మనిషని అందుకే అతన్ని తప్పించేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.


అధికారులు చేయాల్సింది ఏమిటి …? చేసిందేమిటి …?

సాధారణం గా దేవాలయాల్లో లడ్డుల తయారీ కేంద్రం ,ఆలయ ప్రసాదాల విక్రయం కౌంటర్ లు సమన్వయము తో ల‌డ్డూ అమ్మ‌కాలు కోన సాగించాల్సి ఉంటుంది.భక్తుల రాక ను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఇఓ నేతృత్వం లో ఏఇఓ సూపరిండెంట్ ల పర్యవేక్షణలో లడ్డులు తయారు చేయించి , వాటి నాణ్య త ,రుచి ,మన్నిక ను దృష్టిలో పెట్టుకుని అమ్మకాలు కొనసాగించాలి.అదే సమయం లో లడ్డుల తయారీ కేంద్రం పర్యవేక్షకులు ప్రసాదాల విక్రయం కౌంటర్ కు వెళ్లి స్టాక్ ను పరిశీలించి అవసరం మేరకే లడ్డులను తయారు చేయించాలేనే ఆదేశాలుండగా సదరు అధికారి రోజు రోజు యాభై వేళా నుండి ముప్పై వేళా వరకు లడ్డులను తయారు చేయిస్తూ కౌంటర్ కు పంపడం పలు అనుమానాలకు తావీస్తుంది. ఈ ఏడాది మార్చ్ 11 శివరాత్రి నుండే ఈ స్కామ్ కు బీజం పడినట్లు తెలుస్తుంది. మార్చ్ 11 శివరాత్రిని దృష్టిలో పెట్ట్టుకుని భక్తుల కోసం నా లుగు లక్షల ల‌డ్డూలు తయారు చేశామని గతం లో చెప్పిన అధికారులే , ఇప్పుడు మాట మార్చి మూడు లక్షల లడ్డులు మాత్రమే తయారు చేసినట్లు చెపుతుండటం అనేక సందేహాలకు తావిస్తుంది.అలాగే ఆలయ ప్రసాదాల విక్రయం కౌంటర్ లో రెండు షిప్ట్ లలో షిఫ్ట్ కొకరు వంతున ఇద్దరు జూనియ‌ర్ అసిస్టెంట్లు లేదా రికార్డు అసిస్టెంట్ లను నియమించాల్సి ఉండగా ఒక రికార్డు అసిస్టెంట్ వెంకటేష్ నే నియమించుకుని ఈ దందాకు ఉపక్రమించినట్లు ఇందులో ఆలయానికి సంబందించిన ఒక సూపెరిండెండెంట్ ప్రధాన భూమిక పోషించి అంపకాలు సాగించినట్లు తెలుస్తుంది.విక్రయ శాలలో అయిదుగురు తాత్కాలిక ఉద్యోగులను ఎవరి అనుమతి లేకుండా నియమించుకుని వారి జీతాలు ఎవరు ఎక్కడి నుండి ఎందుకు చెల్లించారని విమర్శలు వెలువడుతున్నాయి.ప్అన్ని విషయాలు తేలిసినప్పటికీ అధికారులు ఎవరి వాటాలు వారు పంచుకుని వెంకటేష్ ను బలి పశువును చేసినాట్లు దీని వెనుక నలుగురు అయిదుగురు అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.


టికెట్లు లేకుండానే అమ్మారా ?

రాజన్న గుళ్లో లడ్డు ప్రసాదాల అమ్మకాలు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుకున్నాకే జరుగుతుండగా ల‌డ్డూ అమ్మ‌కాల్లో వెంక‌టేశ్ దొంగ లెక్క‌లు చూపి 2 ల‌క్ష‌ల ల‌డ్డూల‌కు సంబంధించి రూ. 40 ల‌క్ష‌లు కాజేసిన‌ ఘటనలో టికెట్లు లేకుండా అతను ల‌డ్డూల‌ ను ఎలా అమ్మడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టికెట్ ద్వారా అమ్మకాలు జరిగితే 2 లక్షలు టికెట్లు గల బుక్ లు అతనికి ఎవరి ఇచ్చారు,అమ్మకం తరువాత ఏ రోజు కా రోజు డిసిఆర్ లో మొతటి అమ్మకం టికెట్ చివరి అమ్మకపు టికెట్ నంబర్లు చూపించి సదరు అమ్మకాల మొత్తాన్నిఆలయ ఖజానాకు జమ చేయడం రివాజు కాగా అధికారుల అండ ఉన్న వెంకటేష్ ను ఈ విషయమై ఖజానా అధికారి అకౌంట్ విభాగం అధికారులు ప్రశ్నించక పోవడం తో ఇందులో వారి ప్రమేయం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆన్లైన్ లడ్డు విక్ర యాలు ఉన్నప్పటికీ అవి పనిచెయ్యడం లేదనే సాకు చెప్పి మాన్యువల్ గానే అమ్మకాలు కోనా సాగిస్తూ ఈ స్కామ్ కు పాల్పాడ్డాట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు అధికారులు ఆలయం లో ఏ శాఖలో పని చేసిన అవినీతికి ఆజ్యం పోస్తూ దండుకుంటున్నారనివారే ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.కాగా నిందితుడు వెంకటేష్ మాత్రం మౌనం గా ఉంటూ తన తప్పు లేకున్నా తానూ బలైనట్లు సన్నీ హితులకు చెబుతూనే తనను ఆ అధికారులు కాపాడుతారనే నమ్మకంతో ఉన్నట్లు ఆలయ వర్గాల బోగట్టా .


కెటి ఆర్ సార్ పట్టించుకోరా ?


సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో జరుగుతున్నా అవినీతి పై జిల్లా మంత్రి కె టి ఆర్ పట్టించుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.ఆలయానికి పూర్తి స్థాయి ఈఓ ని నియమించాలని ఈ ఓ ల నిర్లక్ష్య ధోరణే ఇక్కడి అధికారుల అవినీతికి కారణమని ఇటివల జరిగిన లడ్డుల స్కామ్ పై పూర్తి స్థాయి విచారణ సిఐడి తో జరిపించి దోషులను శిక్షించాలని కోరుతున్నారు.

Related posts

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

Satyam NEWS

తాడ్వాయి రేంజ్ ఆఫీస్ లో వన్యప్రాణి వారోత్సవాలు

Satyam NEWS

రాయదుర్గంలో హోరేత్తిన వాల్మీకుల నిరసన 

Satyam NEWS

Leave a Comment