34.2 C
Hyderabad
April 19, 2024 20: 56 PM
Slider ఖమ్మం

బ్రహ్మంగారి గుడిని సందర్శించిన పీఠాధిపతి వెంకటాద్రి స్వామి

#Brahmangari temple

బ్రహ్మంగారు కుల మతాలకతీతంగా అందరూ సమానమేనని ఆనాడే తెలిపిన గొప్ప సంఘసంస్కర్త అని, ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి సమాజ సేవలో పాలు పంచుకోవాలని శ్రీ శ్రీ శ్రీ మద్వి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముని మనవడు, బ్రహ్మంగారి మఠం ఎనిమిదవ తరం 12వ పీఠాధిపతి వెంకటాద్రిస్వామి పేర్కొన్నారు. ఒక ప్రైవేట్

కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన గురువారం ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని గణపతి సాయిబాబా గోవిందమాంబ సమేత శ్రీశ్రీశ్రీ మద్వి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాన్ని దర్శించి భక్తులకు తన ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాద్రిస్వామిని పుష్ప గుచ్చాలు,

శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ నిర్మాణం, స్వాముల వారికి అందుతున్న పూజలు, నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను తెలుసుకొని ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ఉత్పాతాల గురించి కాలజ్ఞానంలో ఆనాడే బ్రహ్మంగారు తెలిపారని వివరించారు.

ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించి కుదిపేసిన కరోనా మహమ్మారినితో విలవిలలాడుతూ పిట్టల వలె మానవులు ప్రాణాలను కోల్పోతారని బ్రహ్మంగారు భవిష్యత్తును చెప్పారన్నారు. సమాజంలో జరిగే ఉత్పాతాలు కాలజ్ఞానంలో పొందు పరిచారన్నారు. కులాతీత, మతాతీత సమాజం కోసం పరితపించి ఆచరించి ఆ దిశగా ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి

బ్రహ్మంగారు అన్నారు. గృహస్తు జీవితం గడుపుతూ ముక్తి మార్గాన్ని అనుసరించిన అవతార పురుషుడు బ్రహ్మంగారని అన్నారు. కులాలు అడ్డుగోడలుగా నిలుస్తూ, మతాలు మారణ హోమాలను సృష్టిస్తున్నారని మానవులందరిది ఒకటే కులమని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు బ్రహ్మంగారు అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ

సమాధి అయి 330 సంవత్సరాలు పూర్తి కావస్తున్నదని కుల వివక్షత, అంటరాని తనం వ్యతిరేకంగా కుల, మతాలకు అతీతంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప తత్వవేత్త అని, బ్రహ్మంగారు భారత జాతి గర్వించదగిన గొప్ప సంఘసంస్కర్త అని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తులకు తన ఆశీస్సులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నేలకొండ వీరాచారి, చిట్టోజు చిదంబరచారి, కోశాధికారి నాగార్జునపు బ్రహ్మం, నంచర్ల జనార్ధనాచారి, కీసర బాబు, ఆలయ అర్చకులు నర్సింగోస్ సతీష్ ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరేళ్ళ చిన్నారి పై అత్యాచారయత్నం

Bhavani

నియంత పాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Satyam NEWS

గెలిచేవారికి మాత్రమే మునిసిపల్ టిక్కెట్లు

Satyam NEWS

Leave a Comment