ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం చిట్టేల గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన మహా పూర్ణాహుతి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్పు జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయంలో ఘన స్వాగతం లభించింది.
previous post
next post