37.2 C
Hyderabad
March 29, 2024 20: 06 PM
Slider ఆధ్యాత్మికం

వైశాఖ మాసంలో శ్రీకాకుళం వెంకటేశ్వర ఆలయ ప్రతిష్ట

#VenkateswaraTemple

శ్రీకాకుళం నగరంలో డి.సి.సి.బి.కొలనీ లో నిర్మాణం జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఈ ఏడాది వైశాఖ మాసంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ విశ్రాంత శ్రీ పాంచరాత్రఆగమ సలహాదారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమ సలహాదారు డాక్టర్ చామర్ధి జగ్గప్పచార్యులు పనులను పర్యవేక్షించారు. ఆగమ శాస్త్ర నిపుణుల సూచనలు మేరకు ఆలయ నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపటానికి విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడు కోట్ల రూపాయలు వ్యయం తో నిర్మిస్తున్న ఈ ఆలయం సర్వాంగ సుందరంగా తయారుచేసి జిల్లాకు తలమానికంగా తయారు చేస్తున్నామని అన్నారు.

త్రిదండి చిన జీయర్ స్వామి చేతుల మీదుగా ఈ ఆలయానికి ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఠ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ కు టీటీడీ మరియు రాష్ర్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ లు  ముందుకు రావాలని, తద్వారా పురాతన దేవాలయాల చరిత్ర నేటి తరం తెలుసుకుంటారని ఆగమ సలహాదారు చామర్ధి జగ్గప్పచార్యులు మీడియాతో అన్నారు.

డి.సి.సి.బి.కాలనీ వాసులు ఒక కమిటిగా ఏర్పడి ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం ఎంతో ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ గుణ్ణు వెంకట నరసింహ మూర్తి, విశ్రాంత ప్రిన్సిపల్ టి.శ్రీనివాస రామానుజము, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసిరావు,

అధ్యక్షులు బిందు, కొత్తకోట మధుసూదనరావు,కొత్తకోట అప్పలనాయుడు, డాక్టర్ గెడ్డవలస సురేష్ కుమార్, ఎస్.నరసింగరావు, సురంగి మోహనరావు,శాసపు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంచలనం సృష్టిస్తున్న లోకేష్ ట్వీట్

Satyam NEWS

హ్యాట్సాఫ్ : ఉదారత చాటుకున్న అక్క చెల్లెళ్లు

Satyam NEWS

‘జీ 5’లో డిసెంబర్ 4న ‘కోమాలి’ ప్రీమియర్

Satyam NEWS

Leave a Comment