దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల రెండు తరాల హీరోలు, మామ అల్లుళ్లు వెంకటేష్-నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో దసరా నాడు విడుదల అయింది. గతంలో నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకీ చిన్న కామియో ప్లే చేస్తేనే, థియేటర్స్ లో అక్కినిని దగ్గుబాటి అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏకంగా మల్టీస్టారర్ సినిమానే చేస్తున్నారు అనే ఈ హీరోల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికి శాంపిల్ గానే వెంకీ మామ నుంచి చిన్న గ్లిమ్ప్స్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, దసరా కానుకగా వెంకీ మామ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రెండు జంటలు అంటే వెంకీ పాయల్, రాశి చై కలిసి ట్రాక్టర్ పైన కూర్చోని ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ట్రెడిషనల్ వెర్ కి ఫిమేల్ లీడ్స్ ఆకట్టుకోగా, మామ అల్లుళ్లు మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు
previous post