ప్రజా ప్రతినిధులంతా ప్రతీ సోమవారం చేనేత దుస్తులు వేసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన నేడు సిరిసిల్లలో పర్యటించారు. చేనేత దుస్తులు ధరించడంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదర్శంగా ఉన్నారని, అందరూ ఆయన బాటలో నడుద్దామన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని ప్రతి ఒక్కరు చదివి అవగాహన చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. సమావేశాల్లో అరిచేకంటే పూర్తి అవగాహనతో అధికారులను నిలదీసి పని చేయించాలని సూచించారు. అరిస్తే పేపర్లో ఫోటో వస్తుంది తప్ప ప్రజల్లో పేరు రాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజకీయనాయకులంటే ప్రజల్లో సదాభిప్రాయం లేదన్నారు. ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల గౌరవం పెరిగే విధంగా చూడాలన్నారు. ఎంపీటీసీలు,జడ్పీటీలు అందరితో సమన్వయంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
previous post