28.7 C
Hyderabad
April 24, 2024 05: 34 AM
Slider నల్గొండ

మేనకా గాంధీ అనుచిత వ్యాఖ్యలకు పశువైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

#vetarnary doctors

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ పశువైద్యులపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ తీరును నిరసిస్తూ పశు వైద్యులు నిరసన వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాంగణంలో బుధవారం సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం జరిగింది. పశువులు, గొర్రెలు, మేకలలో కాలానుగుణంగా వచ్చే వ్యాధులు,వాటి నివారణ చికిత్సకు సంబంధించిన వివరాల గురించి, పశువులకు కావలసిన మేత, గడ్డిజాతి పశు గ్రాసాలపై సూచనలు, కృత్రిమ గర్భధారణ, గర్భకోశ వ్యాధులకు సంబంధించిన సూచనలు సలహాలపై సమీక్ష సమావేశం జరిగిన పిదప నియోజకవర్గ పరిధిలోని పశువైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఉన్నత ప్రజా ప్రతినిధిగా (పార్లమెంటు సభ్యురాలు) ఉండి అసభ్య పదజాలంతో పశువైద్య వృత్తిని,పశువైద్యులను దూషించడం చాలా బాధాకరమైన విషయమని, చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య,పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు, హుజూర్ నగర్ ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ రూపకుమార్,ప్రాధమిక పశు వైద్య కేంద్రంవేపలశింగారం, చిలుకూరు, తమ్మారం, మేళ్ళచెరువు, లింగగిరి, కల్మలచెరువు, మఠంపల్లి, దోండపాడు,గరిడేపల్లి,పొనుగోడు,జహన్ పాడ్,పెంచికల్ దిన్నె,చౌటపల్లి డాక్టర్లు శ్రీనివాస రెడ్డి,వీరారెడ్డి,రమేష్, ఉషారాణి, సత్యవతి,సురేష్,శంకర్,మధు,నాగేందర్, సుధాకర్,శ్రీకాంత్,రవి,సుష్మిత, పశువైద్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘సమ్’ క్రాంతే…

Satyam NEWS

బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్

Bhavani

ఏయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వ పెత్తనం వాంఛనీయం కాదు

Satyam NEWS

Leave a Comment