చంద్రబాబునాయుడు తన పట్ల చూపిస్తున్న నిరాదరణకు తట్టుకోలేని ఏపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బిజెపిలో చేరేందుకు ప్రయత్నించారా? అవుననే అంటున్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురామ్. ‘ కోడెల నెల రోజుల క్రితం నాతో మాట్లాడారు. చంద్రబాబు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారని చెప్పారు. కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవం. నిజాయితీ గల నాయకులకు టీడీపీలో విలువ లేదని కోడెల తెలిపారు. అమిత్‌షాను కలవాలని ఆయన అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం’ అని ఆయన అన్నారు.
previous post