జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన జరిగే “హనుమాన్ శోభాయాత్ర” కు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ను విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధులు ఆహ్వానించారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ సతమ్మ క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆహ్వానం పత్రం ఇచ్చి ఆమెను ఆహ్వానించారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ అధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లత్తిపురం వెంకట్రామిరెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు.
previous post