28.7 C
Hyderabad
April 20, 2024 04: 32 AM
Slider ముఖ్యంశాలు

ఆత్మనిర్భర్ భారత్ తో పురోగమిస్తున్న నావికాదళం

#Vice Admiral

ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధానంగా మేలు చేకూరేది త్రివిధ దళాలలకేనని తూర్పునావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు.

స్వదేశీపరిజ్ఞానాన్ని అందిపుచ్చకుని పురోగమించడానికి ఇదే సరైన తరుణం అని ఆయన అన్నారు. పబ్లిక్, ప్రైవేట్, ఎమ్.ఎస్.ఎమ్ ఈ రక్షణరంగ అవసరాలకు పనిచేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.

5 ట్రిలియన్ ఎకనమీ సాధనలో సముద్ర రవాణా కీలకమని ఆయన అన్నారు. అందుకు తగ్గట్టుగా  రక్షణ పర్యవేక్షక వ్యవస్ధను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని వైస్ అడ్మిరల్ తెలిపారు.

ఎదురయ్యే సవాళ్లకు ధీటుగా ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, లాంగ్ రేంజ్ షిప్ లు, న్యూక్లియర్ సబ్ మెరైన్ల ను సమకూర్చుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.

అదే విధంగా మేరీటైమ్ డొమైన్ ఎవేర్ నెస్ పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఆయన అన్నారు. నిర్మాణంలో వున్న విక్రాంత్ ఎయర్ క్రాఫ్ట్ కెరియర్ కోవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు.

2021 లో విక్రాంత్ కు ట్రైల్ రన్ పూర్తయ్యే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. 2022 కల్లా తూర్పు నావికా దళంలోకి చేరవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ సముద్రజలాల్లో 2022 లో ప్రెసిడెంట్స్ మిలన్ జరుగుతుందని ఆయన తెలిపారు. మిలన్ కు రాష్ట్రపతి హాజరవుతారని, రాష్ట్రపతి భవన్ నుంచి ఖరారు కాగానే తేదీలు ప్రకటిస్తామని వైఎస్ ఎడ్మిరల్ వెల్లడించారు.

Related posts

కరీంనగర్ లో 27న  లక్ష మందితో ప్రధాని మోడీ బహిరంగ సభ

Satyam NEWS

గోవిందో గోవిందా: అయ్యో గాజు బాటిళ్ల ప్లాన్ పగిలిపోయిందే!

Satyam NEWS

చిరుధాన్యాలను సాగు చేస్తే లాభాల పంట

Bhavani

Leave a Comment