27.7 C
Hyderabad
March 29, 2024 03: 02 AM
Slider ముఖ్యంశాలు

జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్‌.పి.ల‌తో నూతన ఎస్ ఇ సి వీడియో కాన్ఫ‌రెన్స్

#newSEC

రాష్ట్రంలో మిగిలి వున్న జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తిచేసే విష‌య‌మై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నూత‌నంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నీలం సాహ్ని జిల్లా క‌లెక్ట‌ర్‌లు, పోలీసు సూపరింటెండెంట్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ప‌రిష‌త్ ఎన్నిక‌లు జిల్లాల్లో యంత్రాంగాల స‌న్న‌ద్ధ‌త‌, బ్యాలెట్ బాక్సుల ల‌భ్య‌త‌, కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్ట‌డం, పోలీసు బ‌ల‌గాల ల‌భ్య‌త‌, పోలింగ్ సిబ్బంది నియామ‌కం, మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం త‌దిత‌ర అంశాల‌పై ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్‌లు, ఎస్‌.పి.ల‌తో ఎస్‌.ఇ.సి. స‌మీక్షించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌లకు సంబంధించి గ‌తంలో ప్రారంభించిన ప్ర‌క్రియ పూర్తిచేసేందుకు త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్దంగా వుండాల‌ని జిల్లాల అధికారుల‌ను ఆదేశించారు.

ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌లు ఖచ్చితంగా జ‌రిగేలా చూడాల‌న్నారు. ఎన్నిక‌ల కార‌ణంగా కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్‌ల‌కు ఎస్‌.ఇ.సి. సూచించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌, డిజిపి గౌతం స‌వాంగ్, వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అనిల్ సింఘాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లాలో ఎంపిటిసి, జెడ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు ప్రారంభించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తో వీడియో కాన్ఫ‌రెన్సు అనంత‌రం జిల్లా ఎస్‌.పి.తో క‌ల‌సి అధికారుల‌తో ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ కార్యాల‌య వీడియో కాన్ఫ‌రెన్స్ హాలులో స‌మీక్షించారు.

ఎన్నిక‌ల‌కు ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవ‌స‌ర‌మో గుర్తించి మ‌న వ‌ద్ద ఎన్ని వున్నాయో వాటిలో మ‌ర‌మ్మ‌త్తుల‌కు ఎన్ని గుర‌య్యాయో గుర్తించి వినియోగానికి ఎన్ని ప‌నికి వ‌స్తాయో త‌క్ష‌ణం ఒక నివేదిక రూపొందించాల‌న్నారు. అదేవిధంగా ఆయా బాక్సుల ప‌రిమాణం బ‌ట్టి చిన్న‌వి, పెద్ద‌వి, మీడియం సైజు బాక్సుల‌ను అవ‌స‌రం మేర‌కు త‌యారు చేసుకోవాల‌న్నారు.

ఓట‌ర్ల జాబితా ఆధారంగా ఓట‌రు స్లిప్పుల పంపిణీకి ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. రిట‌ర్నింగ్‌, స‌హాయ రిట‌ర్నింగ్ అధికారుల్లో బ‌దిలీ అయి వెళ్లిన‌వారు, రిటైరైన వారు, ప‌దోన్న‌తిపై వెళ్లిన  వారిని గుర్తించి వారి స్థానంలో వేరొక‌రి నియామ‌కాలు వెంట‌నే చేప‌ట్టేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన వాహ‌నాలు స‌మీక‌రించేందుకు ఆర్టీసీ, ర‌వాణాశాఖ‌, డీఈవో, ప్రాంతీయ ఇంట‌ర్ అధికారుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి స్కూళ్లు, కాలేజీల వ‌ద్ద అందుబాటులో ఉన్న వాహ‌నాలు గుర్తించాల‌న్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్ష‌ణ ఎక్క‌డ ఎప్పుడు నిర్వ‌హించాల‌నే షెడ్యూలు రూపొందించాల‌ని జిల్లాప‌రిష‌త్ సీఈవో. వెంక‌టేశ్వ‌ర‌రావుకు సూచించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్ సెంట‌ర్ల‌న్నీ బ‌హిరంగ ప్ర‌దేశంలోనే ఏర్పాటు చేయాల‌ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గ‌దుల్లో ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. పార్వ‌తీపురం, విజ‌య‌న‌గ‌రంలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఓట్ల‌లెక్కింపుకోసం ఏర్పాట్లు చేయాల‌న్నారు.

పార్వ‌తీపురంలోని మూడు చోట్ల‌, విజ‌య‌న‌గ‌రంలో జె.ఎన్‌.టి.యు క‌ళాశాల‌లో ఓట్ల‌లెక్కింపు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. జిల్లాలో ముగ్గురు జాయింట్ క‌లెక్ట‌ర్ల‌తో పాటు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్‌, విజ‌య‌న‌గ‌రం ఆర్డీఓల‌కు ఎన్నిక‌ల్లో ఏ త‌ర‌హా విధులు అప్ప‌గించాలో ప్ర‌ణాళిక రూపొందించాల‌ని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. స‌మావేశంలో ఎస్‌.పి. రాజ‌కుమారి, జేసీ.(రెవిన్యూ) డా.జే.సీ. కిషోర్ కుమార్‌, జే.సీ.(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డీఆర్ఓ గ‌ణ‌ప‌తిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటకలో కాంగ్రెస్​కు 130పైగా సీట్లు ఖాయం

Bhavani

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Satyam NEWS

వెరైటీ: వివాహం చేసుకున్న ట్రాన్స్ వుమెన్ జర్నలిస్టు

Satyam NEWS

Leave a Comment