34.2 C
Hyderabad
April 23, 2024 11: 50 AM
Slider మహబూబ్ నగర్

కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

#MLA Guvvala Balaraj

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

శనివారం ఆయన జూమ్ యాప్ లో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శి,సర్పంచులు,ఎంపీటీసీ లు,PACS చైర్మన్, డైరెక్టర్స్, డాక్టర్ల లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలందరూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల ఎంపీపీ,జడ్పీటీసీ, ఎంపిడిఓ, mro, SI లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గ్రామాలలో వీధిలలో కరోనా వైరస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలకు వైరస్ బారిన పడకుండా అవసరమైతే వీధి లకు ఐదారుగురుతో కలిసి టీం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ..వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులపై ఆరాతీసి పనులు వేగవంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిధులను వినియోగించుకోవడంలో అభివృద్ధి లో ముందుకు పోవాలని సూచించారు. అదేవిధంగా ఉప్పునుంతల మండల డాక్టర్ తో మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన వారితో కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకున్నారు.

కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాప్రతినిధులు,అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.

Related posts

వార్త దినపత్రిక జర్నలిస్టుపై పాశవికదాడి

Satyam NEWS

ల‌బ్దిదారుల‌కు స‌హ‌కారం అందించాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశం

Satyam NEWS

“బ్యాక్ డోర్”తో అందరికీ బంపర్ ఆఫర్స్ రావాలి!!

Satyam NEWS

Leave a Comment