37.2 C
Hyderabad
March 29, 2024 18: 37 PM
Slider తూర్పుగోదావరి

అన్నవరం దేవస్థానం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

#annavaram

అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో నిర్వహణా పరమైన పలు లోపాలు, అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ  అందిన ఫిర్యాదుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ చేపట్టింది. సాక్షాత్తూ దేవస్థానం పాలక వర్గం సభ్యుడు ఒకరు దేవస్థానంలోని వివిధ పరిపాలనా శాఖల్లోని 24 అంశాలకు సంబంధించిన ఆరోపణలు, అభ్యంతరాలు, లేవనెత్తిన ప్రజాప్రయోజన న్యాయ వ్యాజ్యం అంశాలను 10 పుటల్లో పొందు పర్చి చేసిన ఫిర్యాదు ఆధారంగా స్పెషల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిజి ఆదేశాల మేరకు డిఎస్పీ ముత్యాల నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో 12 మంది విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం దర్యాప్తు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ శాఖ  నిర్వహణ, పర్యవేక్షణలో రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉన్న తిరుపతిలోని తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం తర్వాత రెండోదిగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంనకు చెందిన పలు శాఖల పరిపాలనా విభాగాలపై ఆది నుండి పలు ఆరోపణలు వినపడుతూనే వస్తూన్నాయి.

25 ఏళ్ళుగా ఇక్కడి కొన్ని శాఖల సిబ్బందికి ఆయా స్థానాల్లో పాతుకు పోయారనీ, వీరికి స్థానచలనం కలిగించే ప్రయత్నిస్తే పైరవీలతో కార్యనిర్వహణాధికారి మాటనే ఖాతరు చేయని దేశ ముదురులనీ, ఏండ్ల తరబడి కోట్లాది రూపాయల దేవస్థానం ఆదాయ, వ్యయాల ఆడిట్ జరుగలేదనీ, దుకాణాల నిర్వహణకు జరిపిన వేలం పాటల్లో అక్రమాలు జరిగాయి అనీ, అంతా కొత్తగా నిర్మించిన భూతాది విభాగంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ నవీకరణ పేరుతో మరో రూ. కోట్ల సొమ్ముల వినియోగానికి ప్రతిపాదించడం వెనుక ఆంతర్యం ఏంటో, దేవస్థానం కార్యనిర్వహణా విభాగం అంతర్గతంగా చేస్తున్న కొన్ని నిర్ణయాలు పాలక వర్గానికి అంతుబట్టక పోవడం వంటి పలు విషయాల్లోని కొన్ని అంశాలపై పలు ప్రధాన వార్తా, ప్రసార సాధనాల్లో నిత్యం అగ్ర కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.

వీటికి పాలక వర్గం సభ్యుడు చేసిన ఫిర్యాదు బలం చేకూర్చింది. దీంతో ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్న దేవస్థానం సి సెక్షన్ కు చెందిన దుకాణాల బకాయిలు, 2004 నుండి ఉన్న దస్త్రాలను విజిలెన్స్ సిబ్బంది తొలుత పరిశీలించారు. ఎఈఒ. ఎమ్.కె.టి. ప్రసాద్ నిర్వహించిన దస్త్రాల్లోని లోపాలకు గల కారణాలను అడిగి తెలుసు కున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ శాఖాధికారులు ఆకస్మికంగా ఈ దర్యాప్తు  చేపట్టడంతో దేవస్థానంలోని ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి.

ఈ విచారణ రెండు రోజులు పాటు కొనసాగనున్నట్ఠు ప్రాధమిక సమాచారంగా విచారణాధికారులు మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి ఈ విచారణ పది రోజులు పాటు జరుగనున్నట్టు అనధికార సమాచారం. తొలి రోజు నాటి ఈ దర్యాప్తులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు సత్యకిషోర్, శ్రీనివాసరెడ్డి, ఎమ్మార్వో విజయ్ కుమార్, ఏఓ. భార్గవమహేష్, ఎఫ్ఆర్వో. వల్లీ, ఏజి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గాడ్ ఇన్ లాక్ డౌన్: ఒంటిమిట్ట లో రథోత్సవ పూజలు

Satyam NEWS

కేదార్ నాథ్ ఆలయానికి త్వరలో షార్ట్ కట్ రూట్

Bhavani

జో బైడెన్ ఎన్నికతో పాకిస్తాన్ లో పెల్లుబికిన ఆనందం

Satyam NEWS

Leave a Comment