39.2 C
Hyderabad
March 29, 2024 14: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

onion

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి కొరత ఉన్నందున విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఉల్లి కేంద్రాల్లో దాడులు జరిపారు. 34 కేంద్రాల్లో నిబంధనలు పాటించలేదని గుర్తించారు. వీరిలో 28 మంది ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్​ డీజి రాజేంద్రనాథ్​ రెడ్డి గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 3,398 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 65 లక్షల రూపాయల ఉండవచ్చని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న ఉల్లిపాయలను మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 61 లక్షా 95 వేల రూపాయల విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు

Related posts

కేసీఆర్ గజ్వేల్ లో చెల్లని రూపాయి

Satyam NEWS

రికార్డు స్థాయిలో ఎన్.టి.ఆర్ స్మారక నాణెం అమ్మకాలు

Satyam NEWS

విజయనగరం పోలీసు శాఖ స్పందన కు 26 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment