22.2 C
Hyderabad
December 10, 2024 11: 44 AM
Slider ప్రత్యేకం

విజయ్ పాల్ కు శిక్ష తప్పదు

#vijaypoul

ప్రస్తుత ఉప సభాపతి, అప్పటి పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజును లాకప్ హింస పెట్టిన కేసులోఒంగోలు పోలీసులు విజయ్ పాల్‌ను అరెస్టు చేశారు. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని రఘురామ తెలిపారు. విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, నేడు ఆయన పాపం పండిందని డిప్యూటీ స్పీకర్ అన్నారు.

తనను టార్చర్ చేసిన కేసులో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా విజయ్ పాల్ తెలియదని క్రిమినల్లాగా సమాధానాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. కస్టోడియల్ టార్చర్‌లో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు. అందరూ కలిసి కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని రఘురామ అన్నారు. ప్రధాన నిందితుడు పీవీ సునీల్ కుమార్.. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తని ఆయన ధ్వజమెత్తారు.

పీవీ సునీల్ కుమార్‌కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ కోరారు. అతను దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందని అన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని మండిపడ్డారు రఘురామ. తనను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ-5గా అప్పటి గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసినట్లు రఘురామ చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్ట్ ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టిందని ఆయన తెలిపారు. ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నట్లు చెప్పారు.

Related posts

జిఎస్ టి సమస్యలపై హరీష్ సానుకూల స్పందన

Satyam NEWS

అందరూ సంతోషంగా ఉండడమే  పండగ: ద్వారకానాథ్

Satyam NEWS

సమాజ్‌వాది పార్టీకి దెబ్బ.. బీజేపీలోకి నలుగురు నేతలు

Sub Editor

Leave a Comment