22.2 C
Hyderabad
December 10, 2024 10: 22 AM
Slider గుంటూరు

విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్‌

#vijaypoul

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్‌ రిపోర్టును పోలీసులు కోర్టు ముందుంచారు. విజయ్‌పాల్‌ను పోలీసు రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. రఘురామకు చిత్రహింసల కేసులో విజయ్‌పాల్‌ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు. చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రిమాండ్‌ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Related posts

క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే మేడా పై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా త్వరలో పాదయాత్ర

Satyam NEWS

రేవంత్ రెడ్డి కో హటావో.. కాంగ్రెస్ కో బచావో..

Satyam NEWS

Leave a Comment