27.7 C
Hyderabad
April 26, 2024 04: 33 AM
Slider విజయనగరం

మందు బాబులకు అడ్డాగా మారిన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్…!

#vijayanagarambusstand

మందుబాబులకు అడ్డాగా మారింది.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్. మొన్నటి వరకు మున్సిపాలిటీ గా ఉన్న విజయనగరం ఇటీవలే కార్పొరేషన్ అయి..ఏ గ్రేడ్ స్థాయి ని సంపాదించుకున్న…నగరంలో సమస్యలు ఎక్కడిక్కడే తిష్ట వేసి కూర్చున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం నడిబొడ్డున ఉంది. ఈ ప్రాంతం 33 వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. అదీ కాక..ఈ ఆర్టీసి కాంప్లెక్స్ వద్దే పోలీసు బాస్ బంగ్లా కూడా ఉంది. అంతేనా ఐనాక్స్ ఓ వైపు మసీదు ఓ వైపు… పీఎస్ఆర్ కాంప్లెక్స్ ఇంకోవైపు అలానే పెద్ద చెరువు ట్యాంక్ బండ్ దానికి అనుకుని ఉండే ఎస్వీఎన్ లేక్ పేలస్…ఇన్ని ఉండి ప్రధాన జంక్షన్ అయి ఉండీ అనునిత్యం ట్రాఫిక్ వాహనాల రద్దీ ఉన్న కూడా పందుల స్వైర విహారం, మందు బాబుల అడ్డాగా మారింది ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం. మరి ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ ఏం చేస్తోందో అని నగర ప్రజలకు అనుకుంటున్నారు. ఇప్పటికైనా పెరుగుతున్న నగర జనభా దృష్ట్యా రాత్రి ళ్లు ఇలాంటి అడ్డాల పట్ల కనీసం పోలీసులు అయినా ఓ కన్నేసుంచాలని సత్యం న్యూస్. నెట్ కోరుతోంది. ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

రాజోరి జిల్లాలో తెగబడ్డ ఉగ్రవాదులు: నలుగురి మృతి

Satyam NEWS

ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్

Satyam NEWS

ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా

Satyam NEWS

Leave a Comment