37.2 C
Hyderabad
April 19, 2024 14: 03 PM
Slider విజయనగరం

విజయనగరంలో ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లు…!

#vijayanagaramcollector

రెండోసారి స‌చివాల‌యల‌ త‌నిఖీలు..ఈ సారి 14 వ సచివాల‌యంలో….!

ఆమె ఓ ఫ‌స్ట్ క్లాస్  మెజిస్ట్రేట్… అయితే ఏంటంట అని అన‌కండి…జిల్లా క‌లెక్ట‌ర్ కూడాను …అందునా ఓ మ‌హిళ  ఐఏఎస్ అధికారిణి అయితే ఏంటంట అని మళ్లీ ప్రశ్నించకండి…తాజాగా ఏపీలోని విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లోని అంబ‌టి స‌త్రం  …14 వ వార్డు స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేసారు..ప్ర‌ధానంగా జిల్లా క‌లెక్ట‌ర్ చేప‌ట్టినా ఈ ఆక‌స్మిక త‌నిఖీల‌లో సిబ్బంది హాజ‌రు…యూనిఫాం ద‌రించ‌క‌పోవ‌డం వంటికి క‌లెక్ట‌ర్ క‌ళ్ల‌కు క‌నిపించాయి.

మొన్నామ‌ద్య ఈ విధంగా స‌చివాల‌యంలో సబ్బంది అటెండెన్స్ స‌రిగ్గా లేక‌పోవ‌డం…సీట్ల‌లో స‌గానికి పైగా  ఎవ్వ‌రూ  స‌మ‌యానికి లేక‌పోవ‌డం చూసిన క‌లెక్ట‌ర్…స‌ద‌రు స‌చివాల‌య సిబ్బందకి మెమోలు  కూడా జారీ చేసారు.అయితే జాతాగా జ‌రిగిన స‌చివాల‌య త‌నిఖీల‌లో సిబ్బంది హాజరు పై ఆరా, అలాగే కొందరు సిబ్బంది యూనిఫాం వేసుకోక పోవడంపై అక్క‌డున్న మిగిలిన సిబ్బందిని ప్ర‌శ్నించారు.

అలాగే సచివాలయంలో సిబ్బంది గడ‌చిన‌ వారం రోజులుగా నిర్వహించిన విధులు, అందించిన సేవలపై ఆరా తీసారు.అలాగే అక్క‌డున్న వైద్య ఆరోగ్య స‌హ‌య‌కురాలిని కూడా ప్రశ్నించారు…క‌లెక్ట‌ర్. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తడి పొడి చెత్త గా వర్గీకరణ జరుగుతున్న తీరును శానిటేషన్ కార్యదర్శి ని అడిగి తెలుసుకున్నారు… జిల్లా కలెక్టర్.

అదే విధంగా వార్డు వాలంటీర్ ల హాజరును పరిశీలించిన క‌లెక్ట‌ర్  తక్కువగా వున్న వాలంటీర్ లను తొలగించాలని ఆదేశించారు…జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ..ఇక బహిరంగ స్థలాల్లో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై ఇతరులు ఎవరైనా తమ బ్యానర్ లు ప్రదర్శిస్తే  చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు… జిల్లా కలెక్టర్.

Related posts

కొత్తగూడెం డిఎస్పీగా రెహమాన్

Murali Krishna

ఫేక్ ఎలిమినేషన్ తో రివర్స్ ఓపీనియన్

Satyam NEWS

బ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ “బ్రహ్మ రాసిన కథ”

Satyam NEWS

Leave a Comment