33.2 C
Hyderabad
April 25, 2024 23: 45 PM
Slider విజయనగరం

స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ పర్యటన

#vijayanagaram collector

యాస్ తుపాను విశాఖ తీర‌ప్రాంతాన్ని వ‌ణికిస్తోంది. యాస్ తుపాను నేడు తీరాన్ని  దాట‌వ‌చ్చ‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం ముంద‌స్తుగా తెలిపింది.

యాస్ తుపాను ప్ర‌భావం ఉత్త‌రాంధ్ర‌లోని మ‌రీ ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తీవ్రంగా ఉండబోతున్నదని అంచనా.

దీన్ని దృష్టిలో పెట్టుకునే  జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్..స‌ముద్ర తీర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. తీర గ్రామాల ప్రజలతో మాట్లాడి ప‌రిస్థితి తెలుసుకున్నారు.

పూసపాటి రేగ మండలం కోనాడను  సందర్శించి అక్క‌డే తుఫాను షెల్టర్, ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీసారు.

జాయింట్ కలెక్టర్ డా జే.సీ.కిషోర్ కుమార్, ఆర్ డి ఓ భవానీ శంకర్ లతో కలిసి  తీరం సమీపం వరకు వెళ్లి పరిస్థితిని క‌లెక్ట‌ర్ అంచనా వేసారు.

తీరా ప్రాంత గ్రామాల్లో సిబ్బంది అక్క‌డే వుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

అలాగే గ్రామానికి సరిపడే సరుకులను నిల్వ చేసిందీ లేనిదీ తెలుసుకున్నారు.

జిల్లా ఉన్న‌తాధికారుల‌తో పాటు భోగాపురం సీఐ శ్రీధ‌ర్, పూస‌పాటిరేగ ఎస్ఐ జ‌యంతిలు కూడా కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.

Related posts

ఆటో అదుపు తప్పడంతో ఇద్దరు యువకుల మృతి

Satyam NEWS

మనుషుల్ని చంపే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాఖీ కట్టిన అక్కలు

Satyam NEWS

Leave a Comment