37.2 C
Hyderabad
March 28, 2024 18: 43 PM
Slider విజయనగరం

జ‌నం కోసం సీపీఎం అంటూ 56 వ సచివాలయం వద్ద ధర్నా

#cpm

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో మ‌ళ్లీ  పోరు బాట ప‌ట్టింది…సీపీఎం. జ‌నం కోసం సీపీఎం అంటూ రాష్ట్ర పార్టీ శాఖ ఇచ్చిన పిలుపు మేర‌కు…ఆపార్టీ నేత రెడ్డి శంక‌ర‌రావు…న‌గ‌రంలో పోరు బాట ప‌ట్టారు.జనం కోసం సీపీఎం కార్యక్రమం లో బాగంగా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం 56  వ సచవాలయము  వద్ద ధర్నా కు దిగింది…ఆ పార్టీ.

ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ మా దృష్టి కి ప్రజలు అనేక సమస్యలు తీసుకొచ్చారన్నారు.. ప్రధానంగా ఇల్లు పట్టాలు.. మంచినీ రు .మరుగు దొడ్లు.. డ్రైనేజీ.. అధిక దరలు.. జగనన్న కాలనిలో సమస్యలు వంటివి మాధృష్టికి. వచ్చాయని అన్నారు.

గంజిపెటలో అత్య‌ధికంగా దళితులు నివాసముంటున్న కాలనీలో మంచినీరు.. ఇంటి పట్టాలు లేక‌పోవ‌డంతో  వాటికోసం ఎన్నో  పలు మార్లు పోరాడామన్నారు. ఈ సమస్యలు పైనే సీపీఎం పోరాడుతుందని.. ప్రజలకు న్యాయం జరిగేవరకు మీకు అండగానిలిచేందుకు సీపీఎం నాయకత్వం ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు..

అలాగే జి. వో నెంబ‌ర్ 225  ప్ర కారం ప్రభుత్వ స్థలంలో 75 గజాలు ఉచితంగా రెగ్యులర్ చేయాలి. కానీ అపని ప్రభుత్వం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. పై సమస్యలు పరిష్కారం చేయక పోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చి రించారు .దర్నా అనంతరం సచివాలయం అధికారికి వినతి పత్రాన్ని సమర్పించా రు. ఈ ద‌ర్నాలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బీ. రమణ దేవరాజు. పుణ్యవతి .. కృష్ణవేణి ప్రసాద్.. తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కదిలాయి

Sub Editor

కుంభకోణం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి

Satyam NEWS

విశ్వ రహస్యాలను తెలిపే నాసా పవర్‌ఫుల్‌ టెలిస్కోప్‌

Sub Editor

Leave a Comment