36.2 C
Hyderabad
April 23, 2024 21: 11 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ కు పదోన్న‌తి…న‌ర్సీప‌ట్నం ఏఎస్పీగా బాధ్య‌త‌లు…?

#DSPAnil

విజ‌య‌న‌గ‌రం స‌బ్  డివిజిన్ పోలీస్ అధికారి అనిల్ పులిపాటికి ప‌దోన్న‌తి ల‌భించింది. ఈ మేర‌కే పోలీస్ శాఖ రాష్ట్రంలో  40 మంది డీఎస్పీల‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ న‌ల‌భైమందిలో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ కూడా ఉన్నారు. గ‌తేడాది క‌రోనా విజృంభ‌ణ  స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీగా అనిల్ కుమార్ పులిపాటి బాధ్య‌త‌లు తీసుకున్నారు.

డీఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే పెండింగ్ లోఉన్న ఓ హ‌త్య కేసు మిస్ట‌రీని చేధించారు. అక్క‌డ నుంచీ వ‌రుస‌గా త‌న స‌బ్ డివిజ‌న్ లో పెండింగ్ లోఉన్న  త‌క్కువ  వ్య‌వ‌ధిలో  డిటెక్ట్   గాని కేసుల‌ను  ఇట్టే ప‌రిష్క‌రించి వెంట‌నే కేసు క‌ట్ట‌డంలో  అనిల్ ఎప్పుడూ ముందుంజ‌లో ఉంటార‌ని డీసీఆర్ బీ లెక్క‌లే రుజువు చేసాయి.

వ‌చ్చి దాదాపు  ఏడాది కాకుండానే  డివిజ‌న్ పరిధిలో అనిత‌ర  సాధ్య‌మైన కేసుల‌ను ప‌రిష్క‌రించ‌డంలో అనిల్ కు ఆయ‌న‌కు ఆయనే సాటి. ప‌ట్టుకున్న కేసుల‌లో స్థానిక సిబ్బంది పాత్ర ఉండ‌టం బ‌ట్టి వాళ్ల‌చేతే మీడియా సమావేశంలో మాట్లాడించేవారు. ఆ విష‌యంలో పూస‌పాటిరేగ  ఎస్ఐ జ‌యంతి   అయినా విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్ ఐ నారాయ‌ణ అయినా అదే విధంగా గంట్యాడ ఎస్ఐ కిర‌ణ్ అయినా…వాళ్ల‌కే ఆ క్రెడిట్ వ‌చ్చేలా వ్య‌వహ‌రించేవారు…డీఎస్పీ అనిల్.

ఎంఏ యాంత్ర పోల‌జీ చేసిన అనిల్…విజ‌య‌న‌గ‌రం డీఎస్పీగా బాధ్య‌త‌లు తీసుకోన‌క ముందు రాష్ట్ర పోలీస్ శాఖ  అప‌రిష్క‌తం కాని వేసుల విష‌యంలో  బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ.ఓ ర‌కంగా పోలీస్ శాఖ తాలూకా స‌మాచార శాఖ లో కీల‌క బాధ్య‌త‌లు చూసేవారు. విశాఖ జిల్లా ఆనంద‌పురం వాసి అయిన అనిల్  పులిపాటి కి ఏఎస్పీగా ప‌దోన్న‌తి రావ‌డం మీడియా మొత్తం హ‌ర్షిస్తోంది.

అదీకాక  బొడికొండ విగ్రహం కేసు లోనూ,పూస‌పాటిరేగ థెప్ట్ విష‌యంలోనూ, అలాగే సీసీఎస్ లో రెండు రోబ‌రీ కేసుల ప‌రిష్కారంలో త‌న సిబ్బందిని  ప‌రుగులు పెట్టించి మరీ నిందితుల‌ను పట్టుకున్నారు.ఇక కొత్తీ ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాల‌తో దిశ  యాప్ ను ప్ర‌ధానంగా మ‌హిళ‌లు,అమ్మాయిలు వాడేలా ఎస్ఓఎస్ ఆప‌రేష‌న్ ఏ విధంగా చెయ్యాల్లో అర్ధ‌రాత్రిళ్లు త‌న సిబ్బందితో ప‌ని చేయించిన ఘ‌న‌త కూడా డీఎస్పీ అనిల్ దే అని చెప్పాలి.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

Satyam NEWS

అయ్యన్నపాత్రుడిపై దారుణ వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

Satyam NEWS

ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

Satyam NEWS

Leave a Comment