28.7 C
Hyderabad
April 17, 2024 04: 01 AM
Slider విజయనగరం

విజయనగరం గంటస్థంభం ఆధునికీకరణ పనులు పూర్తి

#kolagatla

విజయనగరానికి తలమానికంగా నిలుస్తున్న గంటస్తంభం ఆధునీకరణ పనులు పూర్తిచేసి  అక్టోబర్ 5వ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  చేతుల మీదుగా ప్రారంభించనున్నామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు.  ఈ మేరకు గంటస్తంభం అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశించారు.

గంటస్తంభం చుట్టూ కలియ తిరుగుతూ తగు సూచనలు ఇచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించే విధంగా అలరారుతున్న గంట స్తంభాన్ని ఆధునికరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా మన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని  చెప్పారు.  కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన జంక్షన్ లను ఇప్పటికే కొన్నిచోట్ల అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అందరి సహకారంతో నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేదారశెట్టి సీతారామమూర్తి, ఏసీపీ మధుసూదన్ రావు, డీఈలు ఏఈలు పాల్గొన్నారు.

Related posts

సిబిఐటి మెకానికల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష

Bhavani

ఎండ్ ఆఫ్ ట్రేడ్ వార్: చైనాతో వాణిజ్య ఒప్పందం ఓకే

Satyam NEWS

Leave a Comment