37.2 C
Hyderabad
April 19, 2024 14: 54 PM
Slider విజయనగరం

ఓ వైపు డిప్యూటీ సీఎం మీటింగ్..మ‌రోవైపు రేంజ్ డీఐజీ ఆక‌స్మిక ప‌ర్యట‌న‌….!

#RajakumariIPS

ఓ వైపు ముందుగా నిర్దేశించిన కార్య‌క్ర‌మం…ఎంతో అర్భాటంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒకేసారి 14 మెడిక‌ల్ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా అదీ వ‌ర్చువ‌ల్ ద్వారా ఓపెనింగ్. రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా గాజుల రేగ‌లో క‌రోనా దృష్ట్యా నామ మాత్రంగా 70 ఎక‌రాల‌లో 500 కోట్ల‌తో నిర్మాణం కానున్న మెడిక‌ల్ కాలీజే కు శంకు స్థాప‌న కార్య‌క్ర‌మంలో డీఎస్పీ తో స‌హా ఇత‌ర పోలీసులు అధికారులంద‌రూ బందోబ‌స్తుకై  బిజీబిజీ.

స‌రిగ్గా అదే స‌మంయ‌లో న‌గరంలోకి విశాఖ రేంజ్ డీఐజీ  రంగారావు వ‌చ్చారు. కేవ‌లం వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ..సంబంధిత సిబ్బంది మాత్ర‌మే జంక్ష‌న్ ల‌లో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే డీఐజీ రంగారావు తో  పాటు రెగ్యుల‌ర్ గా మ‌ధ్యాహ్నం 12  గంట‌ల స‌మ‌యంలోనే జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ కూడా ప‌ర్య‌టించారు.

అయితే డీఐజీ వ‌స్తున్నార‌న్న  స‌మాచారం కేవ‌లం…జిల్లా పోలీసుల‌కే తెలుసు కాని..ఆయ‌నే డీఐజీ అని జిల్లా ప్ర‌జ‌ల‌లో కొంత‌మందికే తెలుసు.ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలోని క‌ర్ఫ్యూ ప‌రిస్థితిని ప‌రిశీలించేందుకు వ‌చ్చిన డీఐజీ రంగారావుకు స‌రిగ్గా బాలాజీ జంక్ష‌న్ వ‌ద్ద బైక్ పై న‌లుగురు బండిపై ఓ ఫ్యామిలీ వెళ్ల‌డం క‌నిపించింది..క‌ర్ఫ్యూ  స‌మ‌యం దాటినా అదీ..బైక్ పై ఇద్ద‌రుక‌న్నామించి దాంతో పాటు కొంద‌రు మాత్ర‌మే మాస్క్ పెట్టుకోవ‌డాన్ని క‌ళ్లారా చూసిన డీఐజీ రంగారావు…జిల్లా పోలీసులు సక్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించ‌డం లేద‌ని ఊహించారు.

త‌న ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న అనంత‌రం విశాఖకు వెళ్లిన అనంతరం..రేంజ్ డీఐజీగా ఎస్పీకి త‌గిన ఆదేశాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.దీంతో సాయంత్రం ఉన్న ప‌ళంగా ఎస్పీ రాజ‌కుమారీ…న‌గ‌ర డీఎస్పీ అనిల్, వ‌న్ టౌన్,టూటౌన్ సీఐలు ముర‌ళీ, శ్రీనివాస‌రావుల‌తో ప్ర‌త్యేకించి డీపీఓలోని తన ఛాంబ‌ర్ లోస‌మావేశం నిర్వ‌హించారు.

వాస్త‌వానికి ఎస్పీ షెడ్యూల్ లో సాయంత్రం శాఖలో ఓ సీఐ,ఇద్ద‌రు ఎస్ఐ ల ప‌ద‌వీవిర‌మ‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆస‌మ‌యానికి  ఎస్పీ..డీపీఓకు వ‌చ్చిన‌ప్ప‌టికీ అక‌స్మాత్తుగా డీఎస్పీ.ఇద్ద‌రు సీఐల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ముగ్గురుని సత్క‌రించారు.

పటిష్టంగా కర్ఫ్యూ అమలుకు చర్యలు-ఎస్పీ

కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వాహనదారలు పై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించాల‌ని త‌న శాఖ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు..జిల్లావ్యాప్తంగా పటిష్టంగా కర్ఫ్యూ నిబంధనల అమలుకు చర్యలు.ప‌టిష్టంగా చేప‌ట్టాల‌ని సూచించారు.

కర్ఫ్యూ సడలింపు సమయంలో బహిరంగ ప్రదేశాలలో కరోనా నిబంధ‌న‌లు పాటించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్రభుత్వం మరో 10 రోజులు కర్ఫ్యూ నిబంధనలను యధాతదంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినందున, జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలు అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి విజ‌య‌గ‌ర డీఎస్పీ , ఇత‌ర సీఐల‌తో ఎస్పీ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  కర్ఫ్యూ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరుకు మార్కెట్ లో  కొనుగోలు లేదా ఇతర అవసరాల నిమిత్తం బయటకు వచ్చేవారు ఖచ్చితంగా క‌రోనా నిబంధనలు పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని శాఖా సిబ్బందిని  ఎస్పీ ఆదేశించారు.

కర్ఫ్యూ అమలులో ఉండే సమయం మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయట తిరిగే వాహనదారుల వాహనాలను సీజ్ చేస్తామని, వారిపై భారీగా జరిమానాలు విధిస్తామ‌ని  ఎస్పీ హెచ్చ‌రించారు.

కేవలం అనుమతులు పొందిన వాహనదారులను, అత్యవసర వైద్య సేవల నిమిత్తంబయటకు వచ్చే వాహనదారులు డాక్ట‌ర్ల‌ ఓవి చీటీలను చూపాల్సి ఉంటుందన్నారు. సరైన డాక్యుమెంట్లును చూపకపోతే ఆయా వాహనాలను సీజ్ చెయ్యడంతో పాటు, వాహనదారుల పై భారీగా జరిమానాలు విధించక తప్పకదని  ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు.

Related posts

రామ‌తీర్ధం బోడికొండ‌పై కేంద్ర మాజీ మంత్రి వీరావేశం…..!

Satyam NEWS

కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

Satyam NEWS

పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment