39.2 C
Hyderabad
April 25, 2024 18: 26 PM
Slider విజయనగరం

కరోన సమయంలో ప్రజలను అలెర్ట్ చేస్తున్న “ఒకే ఒక్కడు”

#VijayanagaramPolice

కరోన సమయంలో ప్రజలను అలెర్ట్ చేస్తున్న “ఒకే ఒక్కడు” ఎవ్వరిని కదిపినా జ్వరం..ఒళ్లు నొప్పులు.. ఆయాసం.. అయితే కచ్చితంగా కరోనా నే.హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోండి..బయట తిరగొద్దు..ఈ మాటలే ప్రతీ చోట వినిస్తున్నాయి…అలానే చూస్తున్నాం.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రావాలంటే మనకొచ్చిన కరోనా ఇతరుల కు సోకకుండా అలాగే బయటకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక ఈ మహమ్మారి కరోనా… ప్రజలను కాపాడాల్సిన , రక్షించాల్సిన డాక్టర్లు, పోలీసులను కూడా కబళిస్తోంది. ఏపీలోని  విజయనగరం జిల్లాలో గత నెలలోనే 200 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకి చాలా మటుకు కోలుకున్నారు.

ఈ మహమ్మారి మూలంగా జిల్లా కేంద్రం లో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై పడింది. దీంతో నలుగురు ఎస్ఐ లతో నగర పరిధిలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్ప నలుగురు ఎస్ఐ లలో ఒకే ఒక ఎస్ఐ మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

ఓ వైపు పగటి పూట ఆరుగంటల కర్ఫ్యూ సడలింపు, ఆ తర్వాత 18 గంటల కర్ఫ్యూ అంటే లాక్ డౌన్. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉన్న ఒకే ఒక ట్రాఫిక్ ఎస్ఐ హరిబాబు ప్రజలకు దండం పెట్టి మరీ వేడుకుంటున్నారు.

ఈ మేరకు విజయనగరం లో ప్రధాన జంక్షన్ లలో ఉన్న ఒక్క జీపు మీద ప్రజలను ఓ వైపు అలెర్ట్ చేస్తునే మరో వైపు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన జంక్షన్ లలో సంచరిస్తున్న వాహనదారులను అలెర్ట్ చేసే పనిలో పడ్డారు.

నగర ట్రాఫిక్ విభాగంలో పని చేసే మిగిలిన ముగ్గురు ఎస్ఐలైన భాస్కరరావు, జీయాయుద్దీన్ ,ప్రసాద్ లు ప్రస్తుతం రోడ్లపై కనిపించక పోవడంతో ఉన్న ఒకేఒక ఎస్ఐ హరిబాబుకూ క్షణం తీరిక లేకుండా ట్రాఫిక్ విధులు నిర్వహించడంతో ఈ కరోనా లాంటి విపత్కర సమయంలో “ఒకేఒక్కడు”లా విధులు నిర్వహిస్తున్నారనే చెప్పాలి.

Related posts

కరోనా ఎఫెక్ట్: ప్రయివేటు హాస్టల్ విద్యార్ధులకు ఉచిత భోజనం

Satyam NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల స్వాధీనం

Satyam NEWS

రాజధానికి చెందిన మరో రైతు గుండె ఆగింది

Satyam NEWS

Leave a Comment