35.2 C
Hyderabad
April 20, 2024 15: 15 PM
Slider ముఖ్యంశాలు

కూతురినే కాటేసిన క‌న్న‌తండ్రి… ఫ‌లితం..శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానం

#deepikaips

ఫోక్సో చ‌ట్టం స‌మ‌ర్ద‌వంతంగా ప‌ని చేస్తోంద‌న్న విజయనగరం జిల్లా ఎస్పీ

త‌ల్లి జ‌న్మ‌నిస్తే…తండ్రి ర‌క్ష‌ణ ఇస్తాడు..!

జ‌న్మించిన బిడ్డ‌ల‌కు త‌రిగిపోని ఆస్థి…!

త‌ల్లి ప‌ది నెల‌లు మోస్తే….!

తండ్రి జీవితాంతం మోస్తాడు…!

త‌ల్లి పిల్ల‌ల క‌ష్ట‌పెట్ట‌నివ్వ‌దు…

తండ్రి…పిల్ల‌లు ఎదుగుల‌పైనే దృష్టి పెడ‌తాడు.

ఇదీ బిడ్ద‌ల‌కు అమ్మ,నాన్న‌లు ఇచ్చే ఆస్థులు. కానీ మారుతున్న కాలంతో పాటు అమ్మ‌,నాన్న‌లలో కూడా మార్పులు సంత‌రించుకుంటున్నాయి..ఫ‌లితంగా కుటుంబ వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అవుతుంది.ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఓ కుటుంబంలో అదే జ‌రిగింది. న‌గ‌రంలో  ప‌దేళ్ల క్రితం కూతురిపై తండ్రి క‌న్నేసాడు. ఇంట్లో భార్యకు తెలియ‌కుండానే క‌న్న‌బిడ్డ‌ను బ‌ల‌త్కారించాడు.

అప్ప‌ట్లో క‌న్న‌తండ్రి దారుణం విజ‌య‌న‌గ‌రం  ప‌ట్ట‌ణంలో సంచ‌ల‌న‌మైంది. అప్ప‌ట్లోనేపోలీసులు కేసు న‌మోదు చేయ‌డం, చార్జ్ షీటు దాఖ‌లు చేయ‌డం.కోర్టుకు స‌బ్ మిట్ చేయ‌డం అన్నీ జ‌రగాయి. అయితే ప‌దేళ్ల  త‌ర్వాత‌..ఆ నిందితుడిని  విజ‌య‌న‌గ‌రం ఫోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. చివ‌ర‌కు  లైంగిక దాడికి పాల్ప‌డిన తండ్రికి జీవిత ఖైదు విధించేలా చేసింది…పోలీస్ వ్య‌వ‌స్థ‌. ఫోక్సో  ప్ర‌త్యేక కోర్టు పై విధంగా తీర్పు ఇచ్చిన‌ట్టు ఎస్పీ  దీపికా తెలిపారు.

విజయనగరంకి చెందిన ఒక వ్యక్తి ప్రైవేటు ఎలక్ట్రిషియన్ గా పని చేస్తూ, తన భార్య ఇంటిలో లేని సమయంలో ప‌దేళ్ల‌ కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశ మహిళా పిఎస్ సిబ్బంది  శ్యామలదేవీ గ‌తేడాది మార్చి 13న  పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు.

ఈ కేసులో అప్పటి దిశ మహిళా పిఎస్ డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. ఈ కేసులో త్వరితగతిన ప్రాసిక్యూషన్ పూర్తి చేసేందుకుగాను సమయానుకూలంగా సాక్షులను కోర్టులో హాజరుపర్చి, నిందితుడు శిక్షింపబడే విధంగా మహిళా పిఎస్ డిఎస్పీ టి. త్రినాధ్ చర్యలు చేపట్టారన్నారు.

ఈ కేసులో పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటరు కొండపల్లి సూర్య ప్రకాష్ బాధితులు తరుపున వాదనలు వినిపించగా, పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షేక్ సికందర్ భాషా నిందితుడికి జీవిత ఖైదు, 50వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు శిక్షింపబడుటలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, వారికి రివార్డులను ఇవ్వనున్నట్లుగా తెలిపారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

రక్త దానానికి యువత ముందుకు రావాలి

Satyam NEWS

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి విశేష స్పందన

Satyam NEWS

ఫైట్ విత్ లైఫ్:వేల పాములు పట్టినా ప్రాణాపాయ స్థితిలో

Satyam NEWS

Leave a Comment