39.2 C
Hyderabad
March 29, 2024 15: 16 PM
Slider విజయనగరం

క‌రోనా బాధితుల పట్ల వివ‌క్ష‌త చూపిస్తే…. చ‌ర్య‌లు త‌ప్ప‌వు

#RajakumariIPS

ఏపీలో క‌రోనా కట్ట‌డికి 18 గంట‌ల పాటు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంది..రాష్ట్ర పోలీస్ శాఖ‌. ఇక ఈ  సెకండ్ వేవ్ మ‌హ‌మ్మారికి పెద్ద‌,చిన్న  తేడాలేకండా ప్ర‌తీ ఒక్క‌రూ దాని బారిన ప‌డుతున్నారు.ఇలాంటి స‌మ‌యంలోనే క‌రోనా బారిన‌ప‌డ్డ వ్య‌క్తుల కుటుంబాల‌కు అండ‌గా ఉండేందుకు రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం  జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ వారిలో మ‌నోధైర్యాన్ని, అండ ఇచ్చేందుకు ఓ సూచ‌న‌ను అమ‌లు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కరోనా సోకిన కుటుంబాల  పట్ల‌, బాదితుల ప‌ట్ల కొంత‌మంది వివ‌క్ష‌త చూపిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చ‌రిస్తూ కొన్ని జాగ్ర‌త్త‌లు ఇచ్చారు. క‌రోనా బాధితులు, మృతుల కుటుంబాల పట్ల వివక్ష‌త చూపిస్తే…చ‌ట్టపరమన చ‌ర్య‌లు త‌ప్ప‌వని. జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ హెచ్చ‌రించారు.

క‌రోనా బాధితులు, మృతుల కుటుంబాలపట్ల వివక్ష చూపొద్ద‌ని వారి ప‌ట్ల మానవత్వం చూపాలని జిల్లా ఎస్పీ  రాజకుమారి త‌న సిబ్బందికి పిలుపునిచ్చారు. క‌రోనా  కారణంగా  ప‌లు కుటుంబాలు వివక్షకు, వేధింపులకు గురవుతున్న సంఘటనలు కొన్ని జిల్లాల్లో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లుగా శాఖ ప్ర‌తిష్ట దెబ్బ‌తిన‌కుండా ఈ విధమైన సందేశం…శాఖా సిబ్బందికి తెలియ చేసారు.

కరోనా వ్యాప్తి తీవ్రమై ప‌లు  కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొనడంతో పాటు ఆర్ధికంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతోంద‌న్నారు.

అలాంట‌గి కుటుంబాల పట్ల ప్రజల‌తో పాటు శాఖా సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలని,  వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ, కొంతమంది కరోనా బాధితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, వారి పట్ల వేధింపులకు పాల్పడుతూ, దురదృష్టవసాత్తు మానవత్వం కోల్పోతున్నారన్నారు.

ఇటువంటి విధానానికి ప్రజలతో పాటు సిబ్బంది కూడా ముగింపు పలకాలని సూచించారు.   ఎవరైనా కరోనా బాధితులు, మృతుల కుటుంబాల పట్ల వివక్ష చూపుతూ, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఎవరైనా ఇటువంటి వేధింపులకు ఎదుర్కొన్నట్లయితే సంబంధిత పోలీసు స్టేషనులో ఫిర్యాదు చెయ్యవచ్చునని, అటువంటి వ్యక్తుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  స్పష్టం చేసారు.

కర్ఫ్యూ ఆంక్షలను పాటిస్తే కరోనాను కట్టడి చెయ్యవచ్చు

జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలను ప్రజలంతా పాటిస్తే, కరోనాను కట్టడి చెయ్యవచ్చునని జిల్లా ఎస్పీ రాజకుమారి  అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటించి, కొద్ది రోజులు ప్రజలంతా బయటకు రాకుండా ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తి కాకుండా నియంత్రించవచ్చు నన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు గురించి ప్రజలకు అప్రమత్తం చేసి, అవగాహన కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేర‌కు జిల్లా ఎస్పీ   ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషనుల్లో   పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరోనా నియంత్రణ జాగ్రత్తలతో కూడిన ప్లకార్డులను రూపొందించి, మార్కెట్ ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ, ప్రజలను జాగృతం చేస్తున్నారు.

ఉదయం 6గంటల నుండి 12గంటల వరకు రైతు బజార్లు, పీడబ్ల్యు మార్కెట్, చేపల మార్కెట్స్, షాపులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను క్యూలైన్లు పాటించే విధంగా చేస్తూ, వారందరూ మ్కాలు ధరించే విధంగా, భౌతికం దూరం పాటించే విధంగా చేస్తున్నారు. మద్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు  6గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తూ, అనవసరంగా బయట తిరిగే వ్యక్తులను, వాహనాలను నిలిపివేస్తూ, వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను సంబంధిత ఎస్ఐలు చేపడుతుండగా, సంబంధిత సీఐలు, డీఎస్పీలు పర్యవేక్షిస్తూ, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేస్తున్నార‌ని ఎస్పీ  తెలియ చేసారు.

Related posts

బలిదాన్ దివస్ సందర్భంగా మొక్కలు నాటిన మహిళా మోర్చా

Satyam NEWS

కొల్లాపూర్ దళిత కాలనీ అభివృద్ధి కోసం అడుగులు

Satyam NEWS

గార్ల మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహావిష్కరణ

Bhavani

Leave a Comment