39.2 C
Hyderabad
April 25, 2024 18: 28 PM
Slider విజయనగరం

ట్రాఫిక్ సిబ్బంది అలెర్ట్ తో తప్పిన పెను ప్రమాదం..400 లీటర్ల డీజిల్ లీక్..!

#traffic police

విజయనగరం జిల్లా కేంద్రం లో ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్ తో పెను ప్రమాదం తప్పింది. దాదాపు 400 లీటర్ల డీజిల్ ట్యాంకర్ లీక్ అయి..రోడ్డంతా కారడం..సకాలంలో ట్రాఫిక్ ఏఎస్ఐ,పీసీలు అలెర్ట్ అయి తమ పై ఉన్నతాధికారైన డీఎస్పీ కి చెప్పడం.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని…చర్యలు చేపట్టడంతో… ఘోర ప్రమాదం తప్పింది.. నగర ప్రజ ప్రశాంతంగా నిద్రపోయింది.

అంతవరకు మాడు పగలు గొట్టే ఎండ కాయడంతో విజయనగర ప్రజలంతా చల్లదనం కోసం ఆరాటపడుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం పడటం.. అదే సమయంలో కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం జరుగుతుండటం ఆ సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు.. ఇద్దరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు హాజరవడం..అంతా హ్యాపీ మూడ్ లో ముగియడం జరిగింది.

ఇక హమ్మయ్య అంటూ అటు కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా రాత్రి సమయంలో ఏ జంక్షన్ లో అయితే ట్రాఫిక్ పోల్ ను ఆర్టీసీ బస్ ఢీ కొట్టిందో అదే ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న ట్రాఫిక్ దిమ్మను విశాఖ నుంచీ ఒడిషాకు చెందిన లారీ..గజపతినగరం వైపు మలుపు తిప్పే సమయంలో లారీ లో ఉన్న దాదాపు 400 లీటర్ల డీజిల్ ట్యాంకర్ బ్రేక్ అయి రోడ్ మీద డీజిల్ మొత్తం కారింది.

ఘటనాస్థలికి ఇరువైపులా రెండు పెట్రోల్ బంక్ లు…జరగబోయే ప్రమాదాన్ని ముందు గానే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ దాలినాయుడు ,పీసీ శ్రీనివాసరావు లు గుర్తించారు. ఓ వైపు చర్యలు చేపడుతునే మరో వైపు డీఎస్పీ మోహన్ రావుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలికి వచ్చి… పెను ప్రమాదం జరగకుండా… దగ్గర నుంచే ఇసుక తెప్పించి… రోడ్ పై పడ్డ అయిల్ వేయించారు.

మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం తో ఫైర్ ఇంజన్ తో కలెక్టరేట్ జంక్షన్ కూ వచ్చారు.అంతలోనే ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..ఎస్పీకి సమాచారం ఇచ్చి… తమ ఎస్ఐ లు భాస్కరరావు, హరిబాబు లతో జంక్షన్ వద్ద ఓ వైపు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు మరోవైపు అదే రోడ్ పై పడ్డ ఆయిల్ పై ఇసుక పోయించి..క్షణాలలో పెను ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.

Related posts

మద్యం దుకాణాల్లో చేతివాటం రూ.20 లక్షల వరకూ గోల్‌మాల్‌

Satyam NEWS

ఓట్ల కోసం దళితులతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

మహిళా భద్రతకు మరిన్ని చర్యలు : డిఐజి రంగనాధ్

Satyam NEWS

Leave a Comment