31.2 C
Hyderabad
April 19, 2024 03: 47 AM
Slider విజయనగరం

మండుటెండలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనేంటో తెలుసా…?

#trafficpolice

విజయనగరం జిల్లా పోలీసు బాస్…ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాలు అంటే సహజంగా శాఖా పరంగా ప్రతీ ఒక్క సిబ్బంది అలెర్ట్ అవుతారు…ఆ ఆదేశాలను శిరసావహిస్తారు. తాజాగా రాష్ట్ర డీజీ నుంచీ ఆదేశాలో లేక…పోలీసు బాస్ గా ఇచ్చిన ఆదేశాలో ఏమో గాని విజయనగరం ట్రాఫిక్ పోలీసులు… హెల్మెట్ అవేర్నస్ ప్రారంభించారు. ఈ మేరకు విజయనగరం లో ఎత్తు బ్రిడ్జి వద్ద..ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,ఎస్ఐ లు దామోదర్, లోవరాజు, ఏఎస్ఐ లు ఆదిత్య, నూకరాజు సిబ్బంది సింహాచలం లు..ప్లకార్డులు పట్టుకుని… వాహనదారులకు చైతన్యం కల్పించారు. హెల్మెట్ ధరించండి..ప్రాణాలు కాపాడుకోండంటూ…కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు “సత్యం న్యూస్. నెట్. ” ప్రతినిధి తో మాట్లాడుతూ.. వాహనదారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని త్రిబుల్స్, హెల్మెట్ లేకుండా బైక్స్ నడుపుతున్నారన్నారు.తొలుత వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని అనంతరం జరీమానాలు విధిస్తామని ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. అలాగే హెల్మెట్ ప్రాధాన్యతను వివరించేందుకు  ట్రాఫిక్ డిఎస్పీ  ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు  ఎత్తు బ్రిడ్జి వద్ద అవగాహన కల్పించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ద్విచక్ర తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ వినియోగం వలన ప్రమాదాలకు గురైన చిన్నపాటి గాయాలతో బయటపడవచ్చనన్నారు. వాహనాలు నడిపే సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురైనపుడు తలకు తీవ్ర గాయాలై, మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా జిల్లా ఎస్పీ  ఆదేశాలతో ప్రజలు, వాహనదారులను చైతన్యపరిచేందుకు, అవగాహన కల్పించేందుకు గాను పట్టణంలో ఎత్తు బ్రిడ్జి వద్ద సిగ్నల్స్ పడి, ఆగివున్న వాహనదారులకు హెల్మెట్ ధారణ గురించి డిఎస్పీ ఎల్.మోహనరావు, ట్రాఫిక్ ఎస్ఐ లు లోవరాజు, దామోదర్, ఎఎసైలు ఆదిత్య, నూకరాజు మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బంది అవగాహన కల్పించారు.

Related posts

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వదిలేది లేదు

Satyam NEWS

తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర

Satyam NEWS

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment