40.2 C
Hyderabad
April 24, 2024 17: 16 PM
Slider విజయనగరం

రిపోర్ట్ అందిన వెంట‌నే కొద్ది గంట‌లలోనే….క‌ట‌కాల వెన‌క్కి నిందితులు…!

#vijayanagarampolice

ఓ వైపు అభాండాలు..ఆరోప‌ణ‌లు మోస్తునే విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ పోలీసులు రిపోర్ట్ అందిన వెంట‌నే కేసుల‌ను అన‌తి కాలంలోనే చేధిస్తున్నారు. తాజాగా 24 గంట‌ల‌లోపే న‌మోదైన‌ రిపోర్ట్ ప్ర‌కారం  ఒక  కేసును…రెండు నెల‌ల క్రితం జ‌రిగిన మ‌రో కేసును  ఛేదించింది నిందితుల‌ను క‌ట‌కటాల  వెన‌క్కు నెట్టారు…న‌గ‌రంలోని టూటౌన్ పోలీసులు. ఈ మేర‌కు డీఎస్పీ అనిల్..త‌న ఛాంబ‌ర్ లో మీడియా స‌మావేశంలో నిందితునితో పాటు ఎంఓ  ఎలా జ‌రిగిందో తెలియ చేసారు.

ఈ నెల 7 వ తేదీన  తెల్లవారుజామున 4.30 గం. సమయంలో విజ‌య‌న‌గ‌రంలోని  ఎల్ఐజీ  52 బాబామెట్ట వద్ద  75 ఏళ్ల ప్ర‌భావ‌తి అనే ఓ వృద్ధురాలు త‌న  ఇంటి దగ్గర పూజకు పువ్వులు తెంపుతుండ‌గా ఓ అప‌రిచిత వ్య‌క్తి ఆమె తలపై కర్రలతో కొట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును అప‌హ‌రించుకుపోయారు.

వెంట‌నే  ఫిర్యాదు అందుకున్న‌టూటౌన్ పోలీసులు..  కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే మ‌ర్నాడు ఉద‌యం న‌గ‌రంలోని ప్ర‌కాశం పార్క్ వ‌ద్ద ఉన్న పైర్ స్టేష‌న్ వ‌ద్ద బొందెల గూడంకు చెందిన‌ ఓ ముప్పై ఏళ్ల గంటా భాస్క‌ర శ‌ర్మ‌.. అత‌నితోపాటు ఇద్ద‌రు చిన్న పిల్ల‌లు త‌చ్చాతుండ‌టంతో…గుర్తించారు…పోలీసులు.

త‌మ‌దైన స్ఠైల్ లోవిచారిస్తే..దొంగ‌త‌నం బయ‌ట‌ప‌డింది. వెంట‌నే నిందితులు చెప్పిన ప్ర‌కారం బంగారు గొలుసును రిక‌వ‌రీ వేసి..కోర్టుకు పంపించ‌డం జ‌రిగింది..అలాగే మ‌రో రెండు కేసులలో  34 ఏళ్ల నిందితుడు  కోట అమర్ నాథ్  కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్ద అనుమానంపై అతన్ని అరెస్ట్ చేసి అతని వద్దనుండి రెండు బైకులు రికవరీ చేశారు. ఈ సమావేశంలో సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు,ఎస్ఐ సాగ‌ర్ బాబు లు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి, సంక్షేమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

Satyam NEWS

ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నఅధికారులు

Satyam NEWS

అభివృద్ధి పనులకు భూమిపూజ శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment