37.2 C
Hyderabad
March 29, 2024 20: 01 PM
Slider విజయనగరం

కర్ఫ్యూ సమయం…రోడ్లన్నీ ఖాకీ వనం..!ఎక్కడంటే…?

#vijayanagarampolice

ఏపీలో విశాఖ రేంజ్ డీఐజీ….విజయనగరం జిల్లా కేంద్రంలో ఆకస్మిక పర్యటన మొదలు.. జిల్లా పోలీసులలో హడావుడి కనిపించింది.

విజయనగరం లో రేంజ్ డీఐజీ పర్యటించిన మరుక్షణం నుంచీ.. జిల్లా ఎస్పీ… సిబ్బంది ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఇక కొద్ది నిమిషాలలో. కర్ఫ్యూ సడలింపు ముగిసి..లాక్ డౌన్ మొదలవబోతున్న సమయంలో వరుసగా రెండో రోజు ఎస్పీ రాజకుమారి.. నగర రోడ్లపై కి వచ్చి… శాఖా సిబ్బందిని పరుగులు పెట్టించారు.

అంతవరకు మరి కాసేపట్లో కర్ఫ్యూ సడలింపు ముగుస్తుంది ఇంక కాస్త విశ్రాంతి తీసుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు అనుకుంటుండగా ఆకస్మికంగా ఎస్పీ నగర రోడ్లపై ప్రత్యక్ష మయ్యారు.

నగరంలో తన బంగ్లా నుంచీ మయూరీ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ, చేపల మార్కెట్, దాసన్నపేట రైతు బజారు, కొత్తపేట, అంబటి సత్రం, మూడు లాంతర్లు, గంటస్తంభం, కేపి టెంపుల్, సి ఎం ఆర్ జంక్షన్ ప్రాంతాలను సందర్శించి, 12గంటల తరువాత కర్ఫ్యూ నిబంధనల ప్రకారం షాపులను స్వయంగా మూసివేయించి, కర్ఫ్యూ , కరోనా నిబందనలు అమలయ్యే విధంగా పర్యవేక్షించారు.

మూడులాంతర్ల వద్ద ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది ని కాస్సేపు అల్లాడించారు.మరోవైపు ఎస్పీ కూడా ఫేస్ కు పకడ్బందీగా రక్షణ కవచంతో పాటు డబుల్ మాస్క్ లను పెట్టుకుని..కరోనా నియంత్రణ కు శాఖ సిబ్బందితో పాటు ప్రజలకు ఓ మార్గదర్శిగా వ్యవహరించారు..ఎస్పీ.

ఏదైనా ఇంతలా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు..కాబట్టే…2వేలు దాటిన కేసులు కాస్త 200 లకు తగ్గాయంటోంది..సత్యం న్యూస్.నెట్.

Related posts

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల మట్టి మాఫియా

Satyam NEWS

రేవంత్ రోడ్‌షో.. భారీగా హ‌జ‌రైన ప్ర‌జ‌లు

Sub Editor

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani

Leave a Comment